For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ పని మీద ఫోకస్ పెడుతున్న అందాల రాశి.. గట్టిగా ప్లాన్ చేసిందే!

  |

  బాలీవుడ్లో ముందు తెరంగ్రేటం చేసి ఆ తర్వాత టాలీవుడ్ కి వచ్చి స్థిరపడింది హీరోయిన్ రాశి కన్నా. ఢిల్లీకి చెందిన ఈ భామ సినిమాల మీద ఆసక్తితో ముందు బాలీవుడ్ కి వెళ్ళింది అక్కడ ఒక సినిమా చేశాక పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో టాలీవుడ్ లోకి వచ్చింది. టాలీవుడ్ లో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే సుమారు ఇప్పటిదాకా 18 పైగా సినిమాలు చేసినా ఈ భామకు స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కలేదు.

  ఈమె వెనుక వచ్చిన హీరోయిన్స్ సైతం స్టార్ హీరోయిన్ హోదా సంపాదించారు కానీ ఈ భామకు మాత్రం అనుకున్నంత క్రేజ్ దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఈ భామ తనను తాను మార్కెట్ చేసుకునే పనిలో పడినట్లు. అది ఎలా ఏమిటి అనే విషయాలు పరిశీలిస్తే..

  బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

  స్టార్ హీరోయిన్ హోదా కోసం

  స్టార్ హీరోయిన్ హోదా కోసం

  తెలుగులో ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నాకు మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు వచ్చింది. కానీ ఈ భామకు సరైన హిట్ మాత్రం సుప్రీం సినిమాతోనే దక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బెల్లం శ్రీదేవి పాత్రలో నటించి రాశి ఖన్నా మంచి మార్కులు సంపాదించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఈ భామ అవకాశాలు దక్కించుకుంది.. నటిగా ప్రూవ్ చేసుకునే పాత్రలు చేస్తూ మరో పక్క అవసరమైతే గ్లామర్ పాత్రలు కూడా చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా సంపాదించాలని ప్రయత్నాలు చేస్తోంది.

  30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్ ఫోటోషూట్ వైరల్.. సరికొత్త అందాలతో

  బక్కచిక్కిన చక్కనమ్మ

  బక్కచిక్కిన చక్కనమ్మ

  అయితే గతంలో కాస్త బొద్దుగా బబ్లీగా కనిపించే ఈ భామ ఈ మధ్య కాలంలో బాగా సన్నబడింది. అయితే తెలుగులో ఈ మధ్య కాలంలో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో ఈ భామ తెలుగులో అవకాశాలు దక్కించుకోవడానికి అలానే తనను తాను మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ భామ రెండు ఆంగ్ల పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు పబ్లిష్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఎలాంటి సందర్భం లేకుండా ఆమె ఇంటర్వ్యూలు ఎందుకు వచ్చాయా అని ఆరాతీస్తే దాని వెనుక ఆమె పీఆర్ టీం ఉందని తెలుస్తోంది. ఈ భామను గట్టిగా ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగా ఆ ఇంటర్వ్యూలు ఇప్పించారని తెలుస్తోంది.

  బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్

  ఇదే కరెక్ట్ టైం

  ఇదే కరెక్ట్ టైం

  మళ్లీ కరోనా రచ్చ మొదలవుతున్న నేపథ్యంలో ఇళ్లకే పరిమితం జనాల దృష్టిలో పడటానికి ఇదే కరెక్ట్ టైమ్ అని భావిస్తున్న రాశిఖన్నా అందులో భాగంగానే ఇలా ప్రేక్షకులకు గుర్తుండేలా కొన్ని ఇంటర్వ్యూలు పబ్లిష్ చేయిస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ భామ తెలుగులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఒక లాయర్ పాత్రలో నటిస్తుందని ప్రచారం జరుగుతుండగా లేదు రిపోర్టర్ పాత్ర చేస్తోందని కూడా మరో ప్రచారం ఉంది. ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దాని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

  Tollywood Stars Unbelievable Support To Vihayy Devarakonda | Filmibeat Telugu
  తెలుగు వారికి దగ్గరయ్యేందుకు

  తెలుగు వారికి దగ్గరయ్యేందుకు

  ఇక తెలుగుతో పాటు ఈ భామ రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. రాజ్ డీకే డైరెక్షన్ లో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అది ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా మొత్తం మీద తెలుగు వారికి దగ్గరయ్యేందుకు, మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ఈభామ ఈ ప్రమోషన్స్ పెట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. ఒకరకంగా బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ క్లిక్ అయితే కాసుల పంట పండటం ఖాయం ఈ నేపథ్యంలోనే ఈ భామ తెలుగువారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందని భావిస్తున్నారు.

  English summary
  After Vijay Deverakonda's World Famous Lover, Raashi Khanna signed ‘Pakka Commercial’ Directed by Maruthi, Reports says Raashi is changing her game plans lately. She's focusing on her establishment. she is going extreme over her PR as she wants to seize the audience attention in the coming days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X