పెద్ద మొత్తంలో ఇస్తానన్నా చేయలేదు.. వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో అదే జరిగింది.. రాశీఖన్నా కామెంట్స్

ఓ హీరోయిన్‌ను పద్దతి గల పాత్రల్లో చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా హాట్ సీన్స్, శృంగారంలో పాల్గొనే సీన్స్‌లో నటిస్తే చూసి తట్టుకోలేరు. అంతవరకు అల్లరి పిల్లగా పద్దతి గల పాత్రలు చేసిన రాశీ ఖన్నాను.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో బెడ్ సీన్స్, శృంగార సన్నివేశాల్లో నటించడం చూసి షాక్ తిన్నారు. అలాంటి పాత్రలు ఎందుకు చేశావని నేరుగా ఆమెనే ప్రశ్నించారు. ఆ పాత్రపై, రాశీఖన్నాపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. అలాంటి పాత్రను చేసినందుకు రాశీ కూడా పశ్చాత్తాపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇకపై అలాంటి పాత్రలు చేయనని ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అనేక విషయాలను వెల్లడించింది.

 అలా బయటపడ్డాను..

అలా బయటపడ్డాను..

లాక్ డౌన్ విధించేకంటే ముందుగా తాను ఓ తమిళ సినిమా షూటింగ్‌లో భాగంగా చెన్నైలో ఉన్నానని తెలిపింది. అదృష్టవశాత్తు లాక్ డౌన్ విధించేలోపే తాను హైద్రాబాద్‌కు చేరుకున్నానని చెప్పుకొచ్చింది. అమ్మనాన్నలతో కలిసి ఇంట్లోనే హ్యాపీగా ఉన్నానని పేర్కొంది.

 పేపర్‌పై ఒకలా..

పేపర్‌పై ఒకలా..

కథలు వినేటప్పుడు ఒకలా ఉంటాయని, తెరపైకి వచ్చేటప్పుడు మరోలా ఉంటాయని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో అదే జరిగిందని తెలిపింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కథ విన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని వదులుకోకూడదని ఫిక్స్ అయ్యానని పేర్కొంది.

 మంచి సన్నివేశాలు కట్..

మంచి సన్నివేశాలు కట్..

తన పాత్రకు సంబంధించిన మంచి సన్నివేశాలు ఎడిటింగ్‌లో పోయాయని తెలిపింది. సినిమా నిడివి దృష్ట్యా తన పాత్రపై మంచి అభిప్రాయం కలిగించే సీన్స్ అన్నీ ఎగిరిపోయాయని చెప్పుకొచ్చింది. ప్రేక్షకులు నన్ను అలాంటి పాత్రలో చూడటానికి ఇష్టపడలేదేమోనని అంది. బబ్లీ, అల్లరి చేసే పాత్రల్లో ఆమోదిస్తారని పేర్కొంది.

Recommended Video

Tollywood Stars Unbelievable Support To Vihayy Devarakonda | Filmibeat Telugu
పెద్ద మొత్తంలో ఇస్తానన్న..

పెద్ద మొత్తంలో ఇస్తానన్న..

తాను ఓ ప్రాజెక్ట్‌ను ఒప్పుకునేటప్పుడు సొంతంగానే నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చింది. అయితే ఒప్పుకునే ముందు కథ,తన పాత్ర, బ్యానర్ ఇలా అన్నింటిని చూసుకుంటానని ఒకవేళ నచ్చకపోతే ఎంత డబ్బు ఇస్తానన్న చేయనని తెలిపింది. కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలోనే ఆఫర్ చేశారని.. అయినా తాను కొన్ని ప్రాజెక్ట్‌లను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X