ఆ సినిమా ఫెయిల్యూర్ ఓ గుణపాఠం.. ఇక జాగ్రత్త పడుతా.. రాశీఖన్నా

అందాల భామ రాశీఖన్నాకు అరుదైన అవకాశం దక్కింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ వేడుకలో పాల్గొనే అవకాశం దక్కడంపై రాశీఖన్నా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా తన అనుభవాలను పంచుకొన్నారు. మహిళల గురించి ఆమె ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించారంటే..

చీఫ్ గెస్టుగా పాల్గొనడం గొప్ప గౌరవం

చీఫ్ గెస్టుగా పాల్గొనడం గొప్ప గౌరవం

ఈ సందర్భంగా రాశీఖన్నా మాట్లాడుతూ.. సమాజంలో ఎదురవుతున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఐఎస్‌బీలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో చీఫ్ గెస్టుగా పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ప్రతి నిత్యం మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను, వారు సాధిస్తున్న విజయాలు నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయి అని రాశీఖన్నా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రపంచాన్ని మార్చే శక్తి

సమాజంలోని ప్రతికూల పరిస్థితులపై మాట్లాడే హక్కు ఉన్నప్పుడు వాటిని గురించి చర్చించడం గొప్ప అవకాశం. అవకాశం దక్కినప్పుడల్లా మన గళాన్ని ఉపయోగించుకొనేందుకు ప్రయత్నించాలి. చైతన్యంగా సాధించేందుకు మహిళలు ఒకరికొకరు సపోర్టు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని మార్చే శక్తి మహిళలకు ఉంది అని రాశీఖన్నా పేర్కొన్నారు.

 నిరాశ కలిగించిందని

నిరాశ కలిగించిందని

ఇటీవల విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తనకు నిరాశ కలిగించిందని, తన పాత్ర సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, సినిమా ఆడకపోవడం చాలా అసంతృప్తికి గురిచేసింది. ప్రతీ ఫెయిల్యూర్ ఓ గుణపాఠంగా ఉంటుందని, ఎప్పటికప్పుడు తీసుకొనే నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక నుంచి పాత్రల ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తాను అని తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది.

Recommended Video

World Famous Lover Review And Rating
రాశీఖన్నా కెరీర్ గురించి

రాశీఖన్నా కెరీర్ గురించి

రాశీఖన్నా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆమె నటించిన ప్రతీ రోజు పండుగే, వెంకీమామ చిత్రాలు విజయాన్ని అందించాయి. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలను అంగీకరించింది. సైతాన్ కా బచ్చా, అరన్‌మణై చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. సైతాన్ కి బచ్చా రిలీజ్ పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X