ఆ పాత్రల కోసం రాశీఖన్నా తహతహ.. విజయ్ దేవరకొండతో..
అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ. అందాల తార రాశీఖన్నాకు అదృష్టం కలిసి రావడం లేదు. గ్లామర్‌తోపాటు ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండే పాత్రల వైపు దృష్టి సారించి సినిమాలు చేస్తున్నా.. రాశీఖన్నాకు హిట్లు పడటం లేవు. తాజాగా ఆమె నటించిన శ్రీనివాస కల్యాణ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఇదిలా ఉండగా, తమిళంలో విశాల్‌తో కలిసి టెంపర్ రీమేక్ ఆయోగ్య చిత్రంలో రాశీ ఖన్నా నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆదరణ పొందకపోవడంతో కొంత నిరాశకు గురైందట. అయితే ఇక ముందు మంచి పాత్రల్లోనే కనిపించాలని, గ్లామర్‌తోపాటు యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రాల్లో నటించాలని డిసైడ్ అయ్యారట. ఆ క్రమంలోనే స్క్రిప్టులను జాగ్రత్తగా వింటున్నారట. కెరీర్‌కు ఉపయోగపడే పాత్రల కోసం తహతహలాడుతున్నట్టు సమాచారం.

తాజాగా విజయ్ దేవరకొండతో జతకట్టి ఓ సినిమా చేస్తున్నది. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ అధినేత కేఎస్ రామారావు, దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీగా రాశీ ఖన్నా ఆశలు పెట్టుకొన్నారట.
రాశీ ఖన్నా కెరీర్ విషయానికి వస్తే, మద్రాస్ కేఫ్ చిత్రంతో దక్షిణాదిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు పొందింది. జై లవకుశతో గ్లామర్‌ను పండించింది. ఇక నటనతోనే కాకుండా గాయకురాలిగా రాణిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











