మత్తెక్కించేలా చూస్తోన్న రాశీ.. హాట్ లుక్స్‌తో ఫోటో షూట్
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా.. ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. బొద్దుగా ఉన్న రాశీ ఖన్నా.. వర్కౌట్లు చేస్తూ జీరో సైజ్‌లోకి వచ్చేసింది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఈ హీరోయిన్.. తాజా ఫోటో షూట్‌తో మత్తెక్కిస్తోంది.
సుప్రీమ్, శివమ్, హైపర్ లాంటి సినిమాల్లో కనిపించి కుర్రకారు గుండెల్ని గిలిగింతలు పెట్టేసింది. చివరగా నితిన్ సరసన శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించింది. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వక పోయినా.. రాశీ ఖన్నాకు మంచిపేరే తీసుకొచ్చింది.

ప్రస్తుతం పల్లెటూరి పిల్లలా, అచ్చమైన తెలుగమ్మాయి పాత్రలో నటిస్తోంది. మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతోన్న ప్రతిరోజు పండగే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. గోదారి గట్టున లంగావోణితో దిగిన ఫోటోలను మరిచిపోక ముందే.. మరో ఫోటో షూట్‌తో యూత్‌కు పిచ్చెక్కిస్తోంది.
నీ కళ్లలోనే ఏదో గమ్మత్తు ఉన్నాదే.. అని పాడుకునేలా చూస్తోన్న రాశీఖన్నా సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. ఇక ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే విడుదలైన చేసిన గ్లింప్స్‌లో రాశీ లుక్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











