సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తోంది.. క్లీవేజ్ షోతో నేషనల్ వైడ్ ట్రెండింగ్.. రాశీ ఖన్నా రచ్చ!!
రాశీ ఖన్నా నేడు సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ ఇది వరకెన్నడూ చేయనిది. వెండితెరపై అంతగా అందాలను ఆరబోయని రాశీ నేడు మాత్రం తన హద్దులను చెరివేసింది. హాట్ హాట్ స్టిల్స్‌తో సోషల్ మీడయాను ఊపేస్తోంది. దేశ వ్యాప్తంగా రాశీ ఖన్నా పేరు మార్మోగిపోతోంది. ట్విట్టర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. సాగర కన్య అవతారమెత్తిన రాశీ ఖన్నా ఫోటోలతోనే ప్రాణాలు తీస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

అలా మొదలైంది..
రాశీ ఖన్నా ప్రయాణం తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంతో మొదలైంది. మొదటి చిత్రంతోనే గ్లామర్ పరంగా, నటనా పరంగా నూటికి నూరు మార్కులు వేయించుకుంది. అక్కడి నుంచి రాశీఖన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. తెలుగులో మీడియం రేంజ్ హీరోలందరితో నటించేసింది.

ఫలితాలతో సంబంధం లేకుండా..
రాశీ ఖన్నా సినిమా హిట్లు ఫట్లు అయ్యాయా? అని ఆలోచించకుండా స్టార్డం పెరుగుతూ వచ్చింది. అయితే తొలిప్రేమ చిత్రంతో రాశీ ఖన్నా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, మెచ్యూర్డ్ నటనతో అందర్నీ ఆకట్టుకుంది. అలా మళ్లీ రాశీ హవా మొదలైంది. ప్రతిరోజూ పండగే, వెంకీమామ చిత్రాలతో మళ్లీ పీక్స్‌కు వెళ్లింది.

విపరీమతమైన విమర్శలు..
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో రాశీ ఖన్నా పాత్రపై నెగెటివ్ టాక్ వచ్చింది. దానిపై రాశీ స్పందిస్తూ... కథలు వినేటప్పుడు ఒకలా ఉంటాయని, తెరపైకి వచ్చేటప్పుడు మరోలా ఉంటాయని ఆ కథ విన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని వదులుకోకూడదని ఫిక్స్ అయ్యానని పేర్కొంది. అయితే తన పాత్రకు సంబంధించిన మంచి సన్నివేశాలు ఎడిటింగ్‌లో పోయాయని రాశీ ఖన్నా తెలిపింది.

సోషల్ మీడియాలో రచ్చ..
అయితే రాశీ ఖన్నా మరీ అంత బోల్డ్‌గా కనిపించే సరికి ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. నిత్యం ఏడుస్తూ ఉండటం లేదా అలాంటీ సీన్లలో కనిపించడంతో ప్రేక్షకులు హర్ట్ అయ్యారు. అయితే ఆ సినిమాతో రాశీ ఖన్నాకు కనువిప్పు కలిగినట్టుంది. ఒకేసరి అలా తనలో ఉన్న గ్లామర్‌ను చూపించేసరికి తట్టుకోలేకపోయారని అర్థం చేసుకున్న రాశీ కొద్దికొద్దిగా అందాలను వడ్డిస్తోంది.
Recommended Video

సాగర కన్యలా..
రీసెంట్‌గా రాశీ ఖన్నా ఓ హాట్ ఫోటో షూట్ చేసింది. అందులో క్లీవేజ్ షోతో నెటిజన్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మళ్లీ నేడు సాగర కన్య రూపంలో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలు ఏకంగా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా రాశీ ఖన్నా హాట్ ఫోటోలే దర్శనమిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











