స్పోర్ట్స్ బ్రాలో షాక్ ఇచ్చిన రాశీ ఖన్నా: అలాంటి పోజులో ఎన్నడూ చూడని హాట్ షో!
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోంది క్యూట్ బ్యూటి రాశీ ఖన్నా. నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఈ ముద్దుగుమ్మ మొదటి నుంచి తనదైన నటనతో అతి తక్కువ సమయంలోనే పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. బోల్డ్ సన్నివేశాల్లో సైతం అదరగొడుతోన్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో అంతకుమించిన హాట్ షోతో రెచ్చిపోతుంది. తాజాగా ఓ హాట్ పిక్ వదిలి అట్రాక్ట్ చేసింది.
మొదటగా హిందీలో : రాశీ ఖన్నా హిందీ చిత్రమైన మద్రాస్ కేఫ్ ద్వారా బాలీవడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. జాన్ అబ్రహం హీరోగా నటించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి మార్కులు పడటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్స్ వచ్చాయి. దీంతో పలు భాషల్లో ఆమెకు ఆఫర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రాశి ఖన్నాకు తెలుగులో అవకాశం వచ్చింది. ముందుగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసింది.

గ్రాండ్ ఎంట్రీ ; నాగార్జున, నాగ చైతన్య నటించిన మనం సినిమా తర్వాత నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడేలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.. నటన పరంగానూ అలరించింది. దీంతో మొదటి చిత్రంతోనే తెలుగులో తెగ ఫేమస్ అయింది. అదే సమయంలో కుర్రాళ్ల మనసుల్లో క్రష్‌గా మారింది. దీంతో తెలుగులో గ్రాండ్ గా ఎంట్రీని సొంతం చేసుకుంది.
అక్కడ బిజీగా : రాశీ ఖన్నా హీరోయిన్ గా తెలుగులో చేసిన మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే 'విలన్' అనే చిత్రంతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది ఈ క్యూట్ బ్యూటి. కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ అక్కడ కూడా బిజీగా మారింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా.

దెబ్బ మీద దెబ్బ : వరుస సినిమా అవకాశాలు అందుకున్న గ్లామరస్ భామ రాశీ ఖన్నా హిందీ, తెలుగు, మలయాళం, తమిళం ఇలా అన్ని చిత్రపరిశ్రమల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో గతేడాది 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో పాటు తమిళంలో తిరు అనే సినిమా చేసింది రాశీ ఖన్నా. కానీ ఇవేవి పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమెకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది.
సీనియర్ హీరోతో : స్టన్నింగ్ బ్యూటి రాశీ ఖన్నా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాలు చేసింది. వీటిలో సర్దార్ అనే సినిమా మాత్రం మంచి హిట్ గా నిలిచింది. ఇక బాలీవుడ్ లో సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తో రుద్ర అనె వెబ్ సిరీస్ లో నటించి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన బబ్లీ గర్ల్ రాశీ ఖన్నా ఇప్పుడు యోధ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.
బోల్డ్ సీన్లు.. వర్కౌట్లు : ఫర్జీ వంటి వెబ్ సిరీసులో బోల్డ్ సీన్లలో నటించి అదరగొట్టిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ అంతకుమించి అందాలు ఆరబోస్తుంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్, థైస్ షో చేస్తొంది. ఇదిలా ఉంటే బ్యూటిఫుల్ రాశీ ఖన్నా ఫిట్ నెస్ ఫ్రీక్ కూడా. అందుకే వర్కౌట్స్ చేస్తుంటుంది. దానికి సంబంధించిన ఓ పిక్ తాజాగా షేర్ చేసింది. బ్లూ కలర్ స్పోర్ట్స్ బ్రాలో ప్లాంక్స్ చేస్తూ ఎన్నడూ చూపించని విధంగా హాట్ షో చేసింది.


Click it and Unblock the Notifications











