రాశీ ఖన్నాకు ఎన్ని కష్టాలో.. హోమ్ వర్క్, పరీక్షలతో బిజీ

హీరోయిన్స్ అందరూ లాక్‌డౌన్‌లో తెగ ఎంజాయ్ చేస్తుంటే.. రాశీ ఖన్నా మాత్రం తెగ కష్టపడిపోతోంది. కొందరేమో ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటే.. మరికొందరు వంటగదిలో దూరి కొత్త రకమైన వంటకాలను నేర్చుకుంటున్నారు. ఇంకొంతమంది తమలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభకు పదును పెడుతున్నారు. అయితే వీరందరిలో రాశీ ఖన్నా మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇంట్లో బుద్దిగా కూర్చోని చిన్న పిల్లలా హోమ్ వర్క్ చేసుకుంటోంది.. పరీక్షలు కూడా రాస్తోంది. ఆ కథేంటో ఓ సారి చూద్దాం.

టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది రాశీ ఖన్నా. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రాశీ.. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడే ఇల్లు కొనుక్కొని సెటిలైంది. అయితే ఈ అమ్మడి దృష్టి ప్రస్తుతం తమిళ పరిశ్రమపై పడింది. రీసెంట్‌గా ఇక్కడ వెంకీమామ చిత్రంతో హిట్ కొట్టిన రాశీ.. తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో నయనతార హీరోయిన్‌గా వచ్చిన అంజలి సీబీఐ చిత్రంలో రాశీ ఖన్నా నటించింది.

Raashi Khanna Learning Tamil Language

అయితే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా బాగానే వర్కౌట్ అయింది. రాశీకి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే తమిళం సరిగా రాకపోవడంతో ఎదుర్కొనే ఇబ్బందులను గ్రహించిన రాశీ.. లాక్‌డౌన్‌లో ఆ భాషను నేర్చుకునేందుకు నడుం బిగించింది.

ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ.. స్కూల్‌కు వెళ్లినట్టుంది.. లీలా టీచర్ నేతృత్వంలో తమిళ భాషను నేర్చుకుంటున్నాను. నాకిప్పుడు క్లాస్ వర్క్, హోమ్ వర్క్, క్లాస్ టెస్ట్ కూడా ఉంది. ఈ లాక్‌డౌన్‌లో మీరు ఎలాంటి పనులను చేస్తున్నారు'అని ప్రశ్నించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X