థియేటర్‌లో చూసిన ఫస్ట్ సినిమా అదే.. ప్రేమ పెళ్లా?పెద్దలు కుదిర్చిన వివాహమా?గుట్టు విప్పిన రాశీ ఖన్నా
ఊహలు ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది రాశీఖన్నా. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. యువ హీరోల సరసన సరైన చాయిస్‌గా పేరు తెచ్చుకుని సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగ చైతన్య వంటి వారి పక్కన నటించి హిట్స్ అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే రాశీ ఖన్నా తాజాగా నెటిజన్లతో లైవ్ చాట్ చేసింది. ఈ క్రమంలో నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అన్నింటికి ఓపిగ్గా సమాధానం చెప్పిన రాశీ.. ఎన్నో సీక్రెట్స్‌ను బయట పెట్టింది. అవెంటో ఓ సారి చూద్దాం.

వారు నా ప్రాణం..
#ASKRaashi పేరిట చేసిన ఈ లైవ్ చాట్‌లో ఎన్నో విషయాలు పంచుకుంది. తెలుగు అభిమానుల గురించి చెప్పమని అడిగితే.. నా ప్రాణం అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా ఛాయ్, కాఫీ ఇష్టమా అని అడిగితే.. ఛాయ్ అని ఎంచుకుంది. జీవితంలో నచ్చిన కొటేషన్ ఏంటంటే.. మార్పు అనేది ఎప్పుడూ ఉండేదే అంటూ సమాధానం ఇచ్చింది.

తదుపరి ప్రాజెక్ట్‌లు..
తదుపరి సినిమాల సంగతేంటని అడిగితే.. అరాన్మై3, హరి డైరెక్షన్‌లో సూర్య సినిమాలో నటిస్తున్నాని తెలిపింది. ఇంకా తెలుగులో చర్చల దశలోనే ఉన్నాయని, ఫిక్స్ అయ్యాక చెబుతానని తెలిపింది. మహేష్ బాబుతో ఎప్పుడు చేస్తారు? అని అడిగితే.. ‘త్వరలోనే చేయాలని ఆశిస్తున్నా.. నేను ఎంతగానో ఎదురుచూస్తున్నా' అని సమాధానమిచ్చింది.

తమిళ పరిశ్రమ గురించి..
తమిళ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. చాలా మంది ప్రతిభా వంతులైన దర్శకులున్నారని తెలిపింది.తనకు వెట్రిమారన్, శంకర్, మణిరత్నం, అట్లీ వంటి దర్శకులంటే ఇష్టమని తెలిపింది. దళపతి విజయ్ తనకు ఇష్టమైన హీరో అని పేర్కొంది. అజిత్ ఛార్మింగ్ హీరో అని కామెంట్ చేసింది.
Recommended Video

ప్రేమ పెళ్లే..
ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అని అడిగితే.. ప్రేమ పెళ్లే చేసుకునే అవకాశాలున్నాయని తెలిపింది. థియేటర్‌లో చూసిన మొదటి సినిమా ఏంటని అడిగితే... టైటానిక్ అని చెప్పింది. నాని గురించి ఒక్కమాటలో చెప్పమంటే.. ఐదు పదాలు చెబుతానని వెరీ హంబుల్ అండ్ వెరీ టాలెంటెడ్ అని తెలిపింది. సుకుమార్, త్రివిక్రమ్‌లో ఎవరితో పని చేస్తారని అడిగితే.. ఇద్దరితో అంటూ స్మార్ట్‌గా ఆన్సర్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











