రాశీ ఖన్నా కూడా అందుకు రెడీ.. ఎన్నో జాగ్రత్తలతో అక్కడికి చెక్కేసింది!!
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలు షూటింగ్‌లతో సందడి సందడిగా మారింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో హీరోలందరూ సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూడా షూటింగ్‌లో పాల్గొన్నాడు. అమితాబ్ ఆల్రెడీ కేబీసీ షూటింగ్‌లో బిజీగానే ఉన్నాడు. అయితే మన టాలీవుడ్‌లో మాత్రం పెద్ద హీరోలు ఇంకాముందుకు రావడం లేదు. మొన్నే ప్రభాస్ ఇటలీకి బయల్దేరాడు.
హీరోల సంగతి ఎలా ఉన్నా.. హీరోయిన్లు మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఒక్కొక్కరు అడుగులు బయటకు వేస్తున్నారు. రకుల్ ప్రీత్ అందరి కంటే ముందుంది. డ్రగ్స్ కేసులో అటు ఇటు తిరుగుతూ బిజీగా ఉన్నా కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. తమన్నా కూడా షూటింగ్ కోసం బయల్దేరగా.. కరోనా పాజిటివ్ అని తేలడంతో షాకైంది.

ఇక రాశీ ఖన్నా తాజాగా షూటింగ్ నిమిత్తం చెన్నైకి చెక్కేసింది. రాశీ చేతిలో ప్రస్తుతం రెండు తమిళ ప్రాజెక్ట్‌లున్నాయి. వాటి కోసం రాశీ ఖన్నా జిమ్‌లో తెగ కష్టపడినట్టు తెలుస్తోంది. తాజాగా రాశీ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పీపీఈ కిట్, ఫేస్ షీల్డ్ ధరించి ప్రయాణం చేసింది. ఇక నేటి నుంచి సెట్‌లో సందడి చేయనుంది. రాశీ ఖన్నా నిన్న షేర్ చేసిన హాట్ ఫోటోలతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











