అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
సోషల్ మీడియాలో రాశీ ఖన్నా చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. లాక్డౌన్‌లో హైద్రాబాద్‌లోనే ఉన్న రాశీ ఖన్నా.. అన్ లాక్ ప్రక్రియ మొదలవ్వడంతోనే సినిమా షూటింగ్‌లతో బిజి బిజీగా అయిపోయింది. ప్రస్తుతం రాశీ ఖన్నాకు తెలుగులో ఒక్క ప్రాజెక్ట్ లేదు. కానీ రాశీ ఖన్నా మాత్రం కోలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారింది. గత కొన్ని రోజులుగా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న రాశీ ఖన్నా మళ్లీ ఇప్పుడు బిజీ కాబోతోన్నట్టుంది.
రాశీ ఖన్నా తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటూ వచ్చింది. పండుగలు, వీకెండ్స్ అని తేడా లేకుండా నిర్విరామంగా షూటింగ్‌లు కానిచ్చేసింది. అలా రాశీ ఖన్నా తన బర్త్ డే సందర్బంగా కాస్త గ్యాప్ తీసుకుంది. ఆ తరువాత చెల్లి పెళ్లి కోసం షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చింది. అలా చాలా గ్యాప్ తరువాత రాశీ ఖన్నా మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే రాశీ ఖన్నా మాత్రం ఏ క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా రాశీ ఖన్నా గోవాలో ప్రత్యక్షమైంది. ఈ మేరకు రాశీ ఖన్నా ఓ పోస్ట్ చేసింది. మరో కొత్త ప్రయాణం ప్రారంభమైంది.. హలో గోవా.. అంటూ రాశీ ఖన్నా పోస్ట్ చేసింది. అందులో రాశీ ఖన్నా మాస్క్‌ను ధరించి పోజులు ఇచ్చింది. అంతే కాకుండా అందరికీ కూడా మాస్క్ ధరించాలని సూచించింది. మొత్తానికి రాశీ ఖన్నా కోవిడ్ నిబంధనలు గట్టిగానే పాటిస్తోన్నట్టు కనిపిస్తోంది. మరి రాశీ ఖన్నా ఆ కొత్త ప్రయాణం ఏంటో చూడాలి.


Click it and Unblock the Notifications











