Don't Miss!
- News మీ సేవలు చాలు ఇక- `అప్ప`ను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ
- Sports IPL 2024: రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
ఆ హీరోతో మూడో సారి రొమాన్స్ చేయబోతున్న రాశి ఖన్నా.. గోల్డెన్ ఛాన్స్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య పోటీ నిత్యం జరిగేదే. చిన్న డిజాస్టర్ వచ్చినా కూడా వేరేవాళ్ళు అవకాశాలు ఎగరేసుకుపోతారు. అయితే రాశి ఖన్నా మాత్రం హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా తన రేంజ్ లో ఛాన్సులు బాగానే అందుకుంటోంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైన ఈ బ్యూటీ ఆ తరువాత వరుస ప్లాప్స్ ఎదురైనా కూడా ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారింది.
రాశి ఖన్నా గత ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు చేసిన ప్రతి రోజు పండగే హిట్టవ్వడంతో ఫామ్ లోకి వచ్చిన అమ్మాడు ఆ తరువాత సినిమాతో మాత్రం ఊహించని డిజాస్టర్ ఎదుర్కొంది. ఇక ఆ తరువాత కోలీవుడ్ పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు టాక్ వచ్చింది. తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గినట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి.
కానీ రాశి ఖన్నా మాత్రం రూమర్స్ జూ చెక్ పెడుతూ వరుసగా సినిమాలను ఒకే చేస్తూ స్పీడ్ పెంచుతోంది. ఇక మరోసారి గోపిచంద్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమైంది. ఇదివరకే ఈ హీరోతో జిల్, ఆక్సిజన్ అనే సినిమాలు చేసింది. ఇక మూడవసారి గోపిచంద్ - మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కోసం హీరోయిన్ గా ఆమెను ఫైనల్ చేసినట్లు సమాచారం. అలాగే మరో రెండు ఆఫర్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. మరి ఆ సినిమాలతో అమ్మడు ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.