పవన్ కళ్యాణ్‌తో ఆ కోరిక తీరింది.. ఆ అనుభూతిని జీవితంలో మర్చిపోలేను
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా (Rashi Khanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఊహాలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసింది. అలా రాశీ ఖన్నా బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవ కుశ, తొలి ప్రేమ, ఇమైక్కా నొడిగళ్, వెంకీ మామ , ప్రతి రోజు పండగే, సర్దార్‌మామ, తిరుచిత్రాంబళం వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా మెగా పవర్ ప్యాక్డ్ కాంబో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ మళ్ళీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌తో ఆ కోరిక తీరిందనీ, ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేనని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏ కోరిక ఏంటీ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఉగాది పండుగకు ముందే అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌గా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో రాశి ఖన్నా (Raashi Khanna) కూడా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయడం తనకు చాలా కాలంగా ఉన్న కల అని రాశీ ఖన్నా వెల్లడించారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టోరీను మొదట తాను వినలేదని, కేవలం పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్‌పై ఉన్న నమ్మకంతోనే కథ వినకుండానే ఈ సినిమాకు ఓకే చెప్పానని తెలిపారు. తర్వాత షూటింగ్ సెట్స్‌లో చేరిన తర్వాతే కథ గురించి క్రమంగా తెలుసుకున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడం తన కెరీర్ ప్రారంభం నుంచే ఉన్న పెద్ద కల అని రాశీ ఖన్నా పేర్కొన్నారు. ఆ కల 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో నెరవేరిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్‌లో ఒక ప్రత్యేకమైన ఆరా ఉంటుందని, మొదట ఆయనతో కలిసి నటించే సమయంలో చాలా నర్వస్‌గా అనిపించిందని చెప్పారు. మొదటిసారి పవన్ కళ్యాణ్‌ను చూసినప్పుడు కొంచెం భయపడ్డానని, ఆ సమయంలో చెప్పాల్సిన డైలాగ్‌లు కూడా మర్చిపోయానని రాశీ ఖన్నా నవ్వుతూ తెలిపారు. అయితే కొద్ది రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆ భయం పూర్తిగా పోయి, ఆయనతో ఎంతో ఫ్రీగా నటించగలిగానని చెప్పారు. సెట్స్‌లో పవన్ కళ్యాణ్ ఉంటే ఒక ప్రత్యేకమైన పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుందని, ఆయనతో కలిసి డాన్స్ చేయడం తన కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిగా నిలిచిపోతుందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ సెట్స్‌లో ఉంటే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుందని రాశీ పేర్కొన్నారు. ఆయన ఎనర్జీ, జోష్ సెట్స్‌లో అందరినీ ప్రేరేపిస్తాయని తెలిపారు. పవర్ స్టార్‌గా ఆయన ఎందుకు అంతటి స్టార్‌డమ్ సంపాదించుకున్నారో ఆయనతో కలిసి పని చేసిన తర్వాతే పూర్తిగా అర్థమైందని ఆమె ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్‌తో కలిసి డాన్స్ చేయడం తనకు మరింత ప్రత్యేక అనుభూతి అని రాశీ ఖన్నా చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, అలాంటి స్టార్‌తో కలిసి స్టెప్ వేయడం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణమని పేర్కొన్నారు. మొదట డాన్స్ చేయడానికి కూడా కొంచెం భయపడ్డానని, కానీ తర్వాత ఆ భయం పోయి ఎంతో ఎంజాయ్ చేస్తూ స్టెప్ వేశానని తెలిపారు.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ గురించి కూడా రాశీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. డీఎస్పీ అందిస్తున్న పాటలు అభిమానులను మరో లెవల్‌లో ఆకట్టుకుంటాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించారని రాశీ ఖన్నా చెప్పారు. గతంలో అభిమానులు ఇష్టపడిన పవన్ కళ్యాణ్ స్టైల్, ఎనర్జీని ఈ సినిమాలో మళ్లీ చూపించబోతున్నారని ఆమె వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ మాస్ ఎలిమెంట్స్, హరీష్ శంకర్ పవర్‌ఫుల్ డైలాగ్స్, రాశీ ఖన్నా గ్లామర్ అన్ని కలిసివచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఎలాంటి రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరకెక్కించారు. దీంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











