పేరెంట్స్ సర్ ప్రైజ్.. రాశీ ఖన్నా బర్త్ డే పిక్స్ వైరల్
ప్రస్తుతం కరోనా ఉధృతి మళ్లీ పుంజుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నాయి.. జనాల్లో భయం తగ్గుతూ వస్తోంది. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి వాటిని కొందరు పాటిస్తున్నారు. ఇంకొందరు పాటించడం లేదు. ఇక కొందరు గ్రాండ్‌గా పార్టీలు చేసుకుంటూ ఉంటే.. ఇంకొందరు మాత్రం పార్టీలకు దూరంగానే ఉంటున్నారు. మరి కొందరు పార్టీలు చేసుకున్నా కూడా.. తక్కువ మందితో ఈవెంట్‌ను కానిచ్చేస్తున్నారు. తాజాగా రాశీ ఖన్నా కూడా అలాంటి పనే చేసింది.
రాశీ ఖన్నా గత కొన్ని రోజలుగా కోలీవుడ్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. పగలు రాత్రీ పండుగలు అని తేడా లేకుండా.. నిరంతరం షూటింగ్‌లతో గడిపేది. అలా రాశీ ఖన్నా బిజీగా ఉన్నా కూడా తన పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకునేందుకు హైద్రాబాద్‌కు వచ్చింది. అయితే హైద్రాబాద్‌లోని తన సొంతింటిని రాశీ ఖన్నా పేరెంట్స్ గ్రాండ్‌గా డెకరేట్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ మేరకు రాశీ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతోన్నాయి.

'బర్త్ డే రాత్రి జరిగిన విషయం గురించి మీకు చెప్పాలి.. నాకు సెలెబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం.. బర్త్ డే పార్టీలు అంటే మరింత ఇష్టం.. అయితే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల నాకు ఇష్టమైన వారిని ఎవ్వరినీ కూడా పిలవలేదు. కానీ నా అద్భుతమైన పేరెంట్స్ మాత్రం.. ఇలా ఏర్పాట్లు చేసి నన్ను సర్ ప్రైజ్ చేశారు. ఇలా అందరూ వర్చువల్‌గా కలిశాం.. వారు విషెస్ అందించారు.. అలా నా టెర్రస్‌ను అందంగా డెకరేట్ చేశారు.. ఎంతో సంతోషంగా అన్ని ఎమోషన్స్ కలిగినట్టు అనిపిస్తోంద'ని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











