ఎన్టీఆర్ బయోపిక్: జయప్రద పాత్రలో రాశీ ఖన్నా?

By Bojja Kumar

మహా నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఆయన సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు ముఖ్య ఘట్టాలు చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల పాత్రలు కూడా ఈ మూవీ ఉండబోతున్నాయి.

ఎన్టీఆర్ హయాంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి జయప్రద పాత్ర కూడా మూవీలో ఉంటుందని, ఈ రోల్ హీరోయిన్ రాశీ ఖన్నా పోషించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం అఫీషియల్‌గా వెల్లడించనున్నారు. మరో వైపు శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

 Raashi Khanna to play Jayapradha role in NTR Biopic?

ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా .... ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నారు. భువనేశ్వరి పాత్రలో మంజిమ మోహన్ నటిస్తున్నట్లు టాక్.

ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. క్రిష్ దర్శకత్వంలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ బాల్యం, సినిమా రంగ ప్రవేశం, నటుడిగా ఎదిగిన వైనం, రాజకీయ ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం లాంటి ఘట్టాలు సినిమా ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X