గోదారి ఒడ్డున లంగా ఓణితో.. ఒంపుసొంపులు చూపిస్తూ అగ్గి రాజేస్తున్న రాశీఖన్నా..
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందం పేరే రాశీఖన్నా. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నరాశీ.. ఇక్కడి ప్రేక్షకుల మనసును దోచింది. అయితే రానురాను సినిమాల్లో బొద్దుగా కనిపిస్తోందన్న కామెంట్లు వచ్చే సరికి మళ్లీ మల్లెతీగలా మారిపోయింది.
సుప్రీమ్, శివమ్, హైపర్ చిత్రాలతో ఆకట్టుకున్న రాశీ.. గతేడాది శ్రీనివాస్ కళ్యాణం అంటూ ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిరోజు పండగే చిత్రంలోహీరోయిన్ గా నటిస్తోంది.ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా రాబోతోన్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.

ప్రస్తుతం గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతోంది చిత్రయూనిట్. రాజమండ్రిలో చేస్తోన్న ఈ షూటింగ్లో.. మొన్నటి వరకు సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నాడు. అయితే తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న మెగా హీరో.. సైరాను చూసేందుకు సిటీకి తిరిగొచ్చేశాడు.
గోదావరి అందాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మెగా హీరో.. అక్కడి వాతావరణాన్ని బాగానే ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాశీ ఖన్నావంతు వచ్చినట్లు కనిపిస్తోంది. గోదారి ఒడ్డున వయ్యారంగా నిలబడి అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
లంగావోణి కట్టుకుని, అచ్చమైన తెలుగమ్మాయిల ఉన్న రాశీని చూసి ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అసలే గోదారి అందాలను తలదన్నేలా అందాలను ఆరబోస్తుంటే.. కుర్రకారు గుండెలు జారిపోకుండా ఉంటాయా?. రాశీ ఖన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











