పెళ్లి గురించి స్పందించిన రాశి ఖన్నా!
రాశి ఖన్నా ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్. పలు చిత్రాలతో బిజీగా గడుపుతోంది. రాశి ఖన్నా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో డియర్ కామ్రేడ్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రాశి ఖన్నా తన పెళ్లి గురించి స్పందించింది. మరో రెండేళ్లలో నా వివాహం జరిగే అవకాశం ఉంది. మా అమ్మానాన్న సంబంధాలు చూడడం ప్రారంభిస్తారు అంటూ తెలిపింది.
మొత్తానికి రాశి ఖన్నా యంగ్ ఏజ్ లోనే వివాహం చేసుకోవడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా కెరీర్ లో సుప్రీం, జై లవకుశ, తొలిప్రేమ లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. రాశి ఖన్నా చివరగా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

రాశి ఖన్నా తమిళంలో రెండు చిత్రాలతో బిజీగా ఉంది. ఇక తన కు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా వివరించింది. తన ఆలోచనలకు విలువ ఇవ్వాలని, సున్నిత మనస్తత్వం కలిగి ఉండాలని తెలిపింది. అన్నింటికంటే ముఖ్యంగా నన్ను నన్నుగా ప్రేమించాలని తెలిపింది. మరి రాశి ఖన్నా కోరుకున్న క్వాలిటీస్ తో అబ్బాయి ఎప్పుడు దొరుకుతాడో!


Click it and Unblock the Notifications











