గ్లామర్ డోసు పెంచిన రాశీ ఖన్నా... బికినీ ఫోటోలతో హల్ చల్!
Recommended Video
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రాశీ ఖన్నా హడావుడి పూర్తిగా తగ్గిపోయింది. ఆమె నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సంవత్సరం క్రితం విడుదలై బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఆ ఎఫెక్టుతో అప్పటి వరకు వరుస సినిమాలతో సందడి చేసిన రాఖీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ కోలీవుడ్లో బిజీ అయ్యారు. త్వరలో మళ్లీ 'వెంకీ మామ' చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా మీడియాలో, సోషల్ మీడియాలో తన ఫేమ్ తగ్గిపోయిందని భావించిందో? ఏమో కానీ... బికినీ అందాల ప్రదర్శనతో అందరి దృష్టి ఆకర్షించే ప్రయత్నం చేసింది.
మేగజైన్ కవర్ పేజీపై బికినీలో
హెల్త్ కేర్ అనే మేగజైన్ ఆగస్టు సంచిక కవర్ పేజీపై రాశీ ఖన్నా బికినీ అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేశారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పాపులారిటీ కోసమే గ్లామర్ డోస్ పెంచిందా?
ఈ మధ్య కాలంలో విజయాల పరంగా, అవకాశాల పరంగా రాశీ ఖన్నా పూర్తిగా వెనకబడిపోయారు. ఈ నేపథ్యంలో తన పాపులారిటీ హైప్ చేసేందుకే ఆమె ఈ బికినీ ఫోజలు ఇచ్చారని టాక్. గత కొన్నేళ్లుగా హీరోయిన్లు ఇలాంటి ఫార్ములానే ఫాలో అవుతూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇపుడు రాశీ ఖన్నా కూడా దాన్నే అనుసరించారు.
బికినీ లుక్ కోసం స్లిమ్‌గా
బికినీ ఫోటో షూట్ కోసం రాశీ ఖాన్న కొన్ని నెలలుగా డైటింగ్ చేస్తోంది. స్లిమ్‌గా, సెక్సీగా కనిపించేందుకు కొంత బరువు తగ్గారు. ఈ ఫోటోల్లో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రాశీ ఖన్నా న్యూ లుక్ మీద మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. మరీ ఇంత సన్న బడటం ఏం బాగోలేదనే కొందరు నిర్మొహమాటంగా చెప్పేశారు.
రాశీ ఖన్నా
రాశీ ఖన్నా సినిమాల విషయానికొస్తే... ఈ ఏడాది ఆమె నటించిన తమిళ చిత్రాలు అయోగ్య, సైతాన్ కా బచ్చా ఇప్పటికే విడుదలవ్వగా ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులో ‘వెంకీ మామ' అనే చిత్రం చేస్తోంది. ‘వెంకీ మామ' విజయం మీదే రాశీ ఖన్నా టాలీవుడ్ కెరీర్ ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications











