ముక్కు, నోటి నుంచి రక్తం.. ఫర్జీ2 కోసం రాశీ ఖన్నా ఎందుకింత సాహసమో తెలుసా?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలంగా పనిచేస్తోంది. 10 ఏళ్లకు పైగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. టాలీవుడ్ లోని స్టార్స్ సరసన నటించి మెప్పించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ ముద్దుగుమ్మకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆశించిన మేర ఫలితం అందుకో లేకపోయింది. దీంతో కొన్నాళ్లుగా బాలీవుడ్ బాట పటింది. అక్కడ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఈ క్రమంలో ప్రాణాలకు మీదికి వచ్చినా కూడా తగ్గకుండా సాహసోపేతమైన స్టంట్స్ చేస్తోంది. తాజాగా తీవ్రంగా గాయపడింది. అయితే ఇంతలా డేర్ స్టంట్స్ చేయడానికి ఓ కారణమూ ఉండిందని తెలుస్తోంది.
దశాబ్దం పాటు టాలీవుడ్ లో పోరాటం...
రాశీ ఖన్నా తెలుగు ప్రేక్షుకులకు 'మనం' చిత్రంలో క్యామియో రోల్ ద్వారా పరిచయం అయ్యింది. ఆ తర్వాత 'ఊహాలు గుసగుసలాడే' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరపై అలరించింది. ఆ తర్వాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలి ప్రేమ, శ్రీనివాస కళ్యాణం, వెంకీ మామ, ప్రతి రోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే సాలిడ్ హిట్ కోసం రాశీ ఖన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతగానో ప్రయత్నించింది. కానీ యావరేజ్, హిట్ దగ్గరే ఆగిపోయింది. సాలిడ్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోలేక పోయింది.

బాలీవుడ్ టు బాలీవుడ్..
ఈ ముద్దుగుమ్మ కెరీయర్ తొలుత బాలీవుడ్ లోనే మొదలైంది. 2013లో మద్రాస్ కేఫ్ అనే చిత్రంతో హిందీలో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో అడుగు పెట్టింది. 2014 నుంచి 2018 వరకు వరసగా టాలీవుడ్ లోనే సినిమాలు చేసింది. తెలుగు సినిమాలనే నమ్ముకుని కెరీయర్ ను సాగించింది. కానీ పెద్ద ఫలితం లేకపోవడంతో ఏడాది పాటు కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ కుదరకపోవడంతో అట్నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక బాలీవుడ్ లో రాశీ ఖన్నాకు కాస్తా మంచి సినిమాలు, సిరీస్ లు అందుతుండటంతో అక్కడే సెటిల్ అయ్యింది. ఇటు తెలుగు లోనూ వచ్చిన అవకాశాలను దక్కించుకుంటోంది.
ఫర్జీ సిరీస్ తో రీసౌండ్..
రాశీ ఖన్నా కెరీయర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ అండ్ ఛాలెంజింగ్ రోల్ ఏదైనా ఉందంటే అది ఫర్జీ సిరీస్ లోని మేఘా వ్యాస్ పాత్రనే. 2023లో హిందీ భాషలో వచ్చిన ఈ సిరీస్ కు బ్రహ్మాండమైన ప్రేక్షకాదరణ దక్కింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన రాశీ ఖన్నా ధీటైనా పెర్ఫామెన్స్ ఇచ్చింది. దీంతో రాశీఖన్నాకు ఈ సిరీస్ తో మంచి పేరు వచ్చింది. దీంతో తన రాబోయే చిత్రాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.
ప్రాణాలకు తెగించి మరీ స్టంట్స్..
తన 12 ఏళ్ల సినీ ప్రయాణంలో రాశీ ఖన్నాకు హిందీలో ఇప్పుడిప్పుడు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ వస్తున్న అవకాశాలను మరింత శ్రద్ధగా వినియోగించుకుంటోంది. ఏకంగా యాక్షన్ సీక్వెన్స్ ల్లోనూ భయంకరమైన స్టంట్స్ చేస్తూ షాక్ ఇస్తోంది. ఈ క్రమంలోనే రాశీ ఖన్నా తాజాగా సెట్స్ లో గాయపడింది. ముక్కు నుంచి రక్తం కూడా కారింది. చేతులు, మోచేతులు, ముఖంపైనా స్వల్పమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె రెస్ట్ మోడ్ లో ఉంది. అయితే రాశీ ఖన్నాకు ఫర్జీ మొదటి సీజన్ తో మంచి పేరు రావడంతో.. ఇక 2వ సీజన్ తో ఎలాగైనా అందరి చూపు తనపై పడేలా తన పాత్ర కోసం ప్రాణం పెడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో లిప్ లాక్ తో సాహసం చేసింది. ఇక 2వ సీజన్ లో యాక్షన్ తో అదరగొట్టబోతోంది. దీంతో ఆ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. ఇక రాశీ ఖన్నా నుంచి నెక్ట్స్ 'తెలుసు కదా', హిందీలో 'టీఎంఈ' అనే ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి.


Click it and Unblock the Notifications











