Raashii Khanna:పెళ్లిపై నోరు విప్పిన రాశీ ఖ‌న్నా... త్వరలో తెలిసిపోతుందిలే అంటూ..

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Raashii Khanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహాలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసింది. అలా రాశీ ఖన్నా బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవ కుశ, తొలి ప్రేమ, ఇమైక్కా నొడిగళ్, వెంకీ మామ , ప్రతి రోజు పండగే, సర్దార్‌మామ, తిరుచిత్రాంబళం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాశీ ఖన్నా తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా వరుస ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. మార్చి 19న ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా రాశీ ఖన్నా వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితంపై కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Raashii Khanna Opens Up About Marriage Rumours During Ustaad Bhagat Singh Promotions

ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు రాశీ ఖన్నా సరదాగా సమాధానాలు ఇచ్చారు. 'ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరా?'అని యాంకర్ ప్రశ్నించగా, రాశీ ఖన్నా స్పందిస్తూ.. 'అలా కాదు. ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వారిని తరచూ కలిసేంత సమయం మాత్రం ఉండదు. నా చాలా మంది స్నేహితులు ఢిల్లీ, ముంబై వంటి వేర్వేరు నగరాల్లో ఉంటారు. హైదరాబాద్‌లో నేను పని చేసిన నటీనటులతో బాగానే ఉంటాను. అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం లేరు. ప్రస్తుతం షూటింగ్స్, ప్రాజెక్ట్స్ కారణంగా చాలా బిజీగా ఉంటాను. అందుకే అందరితో ఫోన్స్ చేసి మాట్లాడటం కూడా కాస్త కష్టంగా మారింది'అని తెలిపారు.

ఇక అదే ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా పెళ్లిపై కూడా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. 'ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరి మీ పెళ్లెప్పుడు?' అని యాంకర్ అడగగా, ఆమె నవ్వుతూ స్పందించారు. 'ప్రస్తుతం అయితే నాకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు. ఒకవేళ ఆలోచనలో ఉంటే మీ అందరికీ తెలిసిపోతుంది కదా. అయినా ఆ సమయంలో నేను చెప్పను. ఇప్పటివరకు నా జీవితంలో అలాంటి వ్యక్తి కూడా లేరు. ఒకవేళ నేను పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేస్తాను' అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.

అయితే యాంకర్ అక్కడితో ఆగకుండా 'మీరు ఎలాంటి మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు?'అని మరో ప్రశ్న అడగగా, రాశీ ఖన్నా తన డ్రీమ్ వెడ్డింగ్ గురించి కూడా చెప్పుకొచ్చారు. 'నా పెళ్లి చాలా గ్రాండ్‌గా కాకుండా, చాలా క్లోజ్ పర్సన్స్ మధ్య సింపుల్‌గా జరగాలని నేను అనుకుంటాను. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఉండేలా ఒక సింపుల్ మరియు అందమైన పెళ్లి కావాలని నా డ్రీమ్'అని తెలిపారు.

రాశీ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎందుకంటే గత కొంతకాలంగా ఆమె వ్యక్తిగత జీవితంపై పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా హీరో సాయి దుర్గ తేజ్ తో ఆమె ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశముందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌కు ఇటీవల జరిగిన ఒక సంఘటన మరింత బలం చేకూర్చింది. హీరో అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో రాశీ ఖన్నా పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ వేడుకల్లో ఆమె సాయి దుర్గ తేజ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కూడా ఎంతో సన్నిహితంగా మాట్లాడటం కనిపించడంతో, వీరిద్దరి మధ్య నిజంగానే ఏదైనా ప్రత్యేకమైన సంబంధం ఉందా? అనే సందేహాలు అభిమానుల్లో కలిగాయి. అయితే ఈ వార్తలపై రాశీ ఖన్నా నేరుగా స్పందించకపోయినా, తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలతో పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే అయింది. ప్రస్తుతం తన కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టానని, పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ప్లాన్ లేదని ఆమె చెప్పడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X