Raashii Khanna : చంద్రకాంత శారీలో రాశీ ఖన్నా .. బ్యాక్‌లెస్ అందాలతో రచ్చ చేస్తోన్న ఢిల్లీ బ్యూటీ
ఊహాలు గుసగుసలాడే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన నార్త్ ఇండియన్ బ్యూటీ రాశీ ఖన్నా. అందం, అభినయంతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది. తొలి సినిమాలో పద్ధతిగా కనిపించిన రాశీ తర్వాత హద్దులు చెరిపిసేసింది. జిల్లా సినిమాలో ఏకంగా గోపీచంద్‌కు లిప్ లాక్ ఇచ్చి తాను ఏ తరహా రోల్‌కైనా రెడీ అని చెప్పింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రాశీ ఖన్నా తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
30 నవంబర్ 1990న ఢిల్లీలో జన్మించారు రాశీ ఖన్నా. స్థానిక సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి అనంతరం లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. చదువులో ముందుండే ఈ ముద్దుగుమ్మ .. తొలుత సింగర్ కావాలని కలలు కన్నారు. అయితే తర్వాత ఐఏఎస్‌కి సన్నద్ధమయ్యారు. కానీ అనుకోకుండా మోడలింగ్‌లోకి వచ్చిన రాశీ ఖన్నా.. అటు నుంచి నటిగా మారారు. మోడల్‌గా దేశంలోని టాప్ బ్రాండ్స్‌కి చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటించారు.

తొలుత హిందీలో 2013లో మద్రాస్ కేఫ్ అనే స్పై థ్రిల్లర్‌లో నటించారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాదు.. ఏకంగా రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి సత్తా చాటింది. తొలి సినిమాతోనే హిట్‌ను ఖాతాలో వేసుకున్న రాశీ ఖన్నా తెలుగు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కళ్లలో పడ్డారు. డైరెక్టర్‌గా తన తొలి సినిమా ఊహాలు గుసగుసలాడేలో నాగశౌర్య పక్కన హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు నటిగా రాశీకి మంచి మార్కులు పడ్డాయి.
తర్వాత మనం, జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్, జై లవ కుశ, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలి ప్రేమ, శ్రీనివాస కళ్యాణం, వెంకీ మామ, ప్రతీరోజూ పండగే, పక్కా కమర్షియల్ , థాంక్యూ వంటి సినిమాల్లో రాశీ ఖన్నా నటించారు. తెలుగులో వచ్చిన పాపులారిటీతో తమిళ్, మలయాళం, హిందీ మూవీల్లోనూ ఆమెకు ఆఫర్లు వచ్చాయి. లాస్ట్ ఇయర్ అరన్‌మనై 4తో తమిళంలో బ్లాక్‌బస్టర్ కొట్టారు రాశీ ఖన్నా. ఈ ఏడాది ఆమె నటించిన సబర్మతి రిపోర్ట్ అనే హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాక తెలుసు కదా, టీఎంఈ, అఘాతీయ అనే సినిమాల్లోనూ రాశీ నటిస్తున్నారు.
ఉత్తరాది అమ్మాయే అయినా పట్టుబట్టి తెలుగు నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి చేరుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు రాశీ ఖన్నా. డబ్బింగ్ చెప్పడమే కాదు తెలుగులో అద్భుతంగా పాటలు పాడగలరు ఈ ముద్దుగుమ్మ. జోరు, విలన్, బాలకృష్ణుడు, జవాన్, ఊరంతా అనుకుంటున్నారు, ప్రతిరోజు పండగే వంటి సినిమాల్లో రాశీ ఖన్నా పాటలు పాడారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈమె.. తాజాగా మెరూన్ కలర్ శారీ కట్టి బ్యాక్‌లెస్ ఫోజులతో అందాల ప్రదర్శన చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రాశీ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











