బ్లాక్ బెర్రీలా ఊరిస్తున్న రాశి ఖన్నా.. అక్కడ ముడి విప్పిందో అంతే సంగతులు

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన ఊహాలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రాశీ ఖన్నా. ముద్దుగా బొద్దుగా ఉండే రాశీ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యారు. అందం, అభినయంతో అనతికాలంలోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రాశీ ఖన్నా తాజాగా చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

30 నవంబర్ 1990న ఢిల్లీలో జన్మించారు రాశీ ఖన్నా. స్థానిక సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి అనంతరం లేడీ శ్రీరామ్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. చదువులో ముందుండే రాశీ ఖన్నా .. తొలుత లతా మంగేష్కర్ తరహాలో సింగర్ కావాలని కలలు కన్నారు. అయితే తర్వాత ఐఏఎస్‌కి ప్రిపేర్ అయ్యారు. కానీ విధి ఆమెను సినీరంగం వైపు నడిపించింది. తొలుత మోడలింగ్‌లోకి దిగిన రాశీ ఖన్నా .. తర్వాత నటిగా మారారు. మోడల్‌గా దేశంలోని టాప్ బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరించారు.

Raashii Khanna PhotoShoot With latest black and white dress Her photos here

తొలుత హిందీలో 2013లో మద్రాస్ కేఫ్ అనే స్పై థ్రిల్లర్‌లో నటించారు రాశీ ఖన్నా. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి సత్తా చాటింది. తొలి సినిమాతోనే హిట్‌ను ఖాతాలో వేసుకున్న రాశీ ఖన్నా గోల్డెన్ హ్యాండ్‌గా ముద్ర వేయించుకున్నారు. ఈ క్రమంలో నటుడు , దర్శకుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్టర్‌గా తన తొలి సినిమా ఊహాలు గుసగుసలాడేలో నాగశౌర్య పక్కన హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు నటిగా రాశీకి మంచి మార్కులు పడ్డాయి.

ఈ సినిమాలో శారీలో పద్ధతిగా కనిపిస్తూ గిలిగింతలు పెట్టిన రాశీ.. తర్వాత జిల్‌లో గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఇందులో హీరో గోపీచంద్‌కు లిప్ లాక్ ఇచ్చి షాకిచ్చింది రాశీ ఖన్నా. అనంతరం మనం, జోరు, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్, జై లవ కుశ, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలి ప్రేమ, శ్రీనివాస కళ్యాణం, వెంకీ మామ, ప్రతీరోజూ పండగే, పక్కా కమర్షియల్ , థాంక్యూ వంటి సినిమాల్లో రాశీ ఖన్నా నటించారు.

టాలీవుడ్‌లో వచ్చిన పాపులారిటీతో తమిళ్, మలయాళం, హిందీ మూవీల్లోనూ ఆమెకు ఆఫర్లు వచ్చాయి. లాస్ట్ ఇయర్ అరన్‌మనై 4తో తమిళంలో బ్లాక్‌బస్టర్ కొట్టారు రాశీ ఖన్నా. ఈ ఏడాది ఆమె నటించిన సబర్మతి రిపోర్ట్ అనే హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాక తెలుసు కదా, టీఎంఈ, అఘాతీయ అనే సినిమాల్లోనూ రాశీ నటిస్తున్నారు. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు భాషను ఎంతో ఇష్టపడే రాశీ ఖన్నా.. తేనేలూరే తెలుగును నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడంతో పాటు తెలుగులో ఏకంగా పాటలు కూడా పాడింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రాశీ ఖన్నా.. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో రెచ్చిపోతున్నారు. ఎద భాగంలో ముడి వేసి కవ్విస్తూ హాట్ ఫోజులు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రాశీ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: raashii khanna movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X