చక్కనమ్మ చిక్కినా అందమే .. ట్రెడిషనల్ లుక్‌లో నలిపేస్తోన్న రాశీఖన్నా
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన ఊహాలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రాశీ ఖన్నా. అందం, అభినయంతో, పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్న రాశీకి కెరీర్ బాగానే సాగిపోయింది. అయితే అనుకున్నంత స్థాయిలో స్టార్ హీరోల పక్కన కాంబినేషన్ సెట్ కాకపోవడంతో లాంగ్ రన్‌లో ఆమె టాలీవుడ్‌లో నిలబడలేకపోయారు.
30 నవంబర్ 1990న ఢిల్లీలో జన్మించారు రాశీ ఖన్నా. స్థానిక సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి అనంతరం లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ వయసులో అందరి మాదిరిగానే తొలుత సింగర్ కావాలని కలలు కన్నారు రాశీ ఖన్నా. తర్వాత ఐఏఎస్‌కి ప్రిపేర్ అయినా విధి ఆమెను సినీరంగం వైపు నడిపించింది. తొలుత మోడలింగ్‌లోకి దిగిన రాశీ ఖన్నా .. తర్వాత నటిగా మారారు.

తొలుత హిందీలో 2013లో మద్రాస్ కేఫ్ అనే స్పై థ్రిల్లర్‌లో నటించారు రాశీ ఖన్నా. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో నటుడు , దర్శకుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్టర్‌గా తన తొలి సినిమా ఊహాలు గుసగుసలాడేలో నాగశౌర్య పక్కన హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆ తర్వాత జిల్, మనం, జోరు, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్, జై లవ కుశ, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలి ప్రేమ, శ్రీనివాస కళ్యాణం, వెంకీ మామ, ప్రతీరోజూ పండగే, పక్కా కమర్షియల్ , థాంక్యూ వంటి సినిమాల్లో రాశీ ఖన్నా నటించారు.
టాలీవుడ్‌లో వచ్చిన పాపులారిటీతో తమిళ్, మలయాళం, హిందీ మూవీల్లోనూ ఆమెకు ఆఫర్లు వచ్చాయి. గతేడాది అరన్‌మనై 4తో తమిళంలో బ్లాక్‌బస్టర్ కొట్టారు రాశీ ఖన్నా. ప్రస్తుతం ఆమె నటించిన సబర్మతి రిపోర్ట్ అనే హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాక తెలుసు కదా, టీఎంఈ, అఘాతీయ అనే సినిమాల్లోనూ రాశీ నటిస్తున్నారు. తెలుగు భాషను ఎంతో ఇష్టపడే రాశీ ఖన్నా.. తెలుగును నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడంతో పాటు తెలుగులో ఏకంగా పాటలు కూడా పాడి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
బొద్దుగా ఉండే రాశీ ఖన్నా.. సైజ్ జీరోలోకి మారడంతో ఫేస్‌లో మునుపటి ఛార్మింగ్ మిస్ అయ్యిందంటూ అభిమానులు బాధపడుతున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా కనిపిస్తూనే, బోల్డ్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షో చేయగలదు. తాజాగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవితా గుత్తా డిజైన్ చేసిన ఆరెంజ్ కలర్ కాంజీవరం లెహంగాలో రాశీ మెరిసిపోతున్నారు. ఈ ఔట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యేలా ఝమ్కా, ఫింగర్ రింగ్, బ్యాంగిల్స్‌ను ఎంచుకున్న ఆమె మత్తెక్కించే కళ్లతో చూస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు. ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అవుతుండగా .. మరి ఇంకేందుకు ఆలస్యం రాశీఖన్నా అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











