‘నేను చేసిన పెద్ద తప్పు అదే.. అందుకే నా కెరీర్ మొత్తం నాశనం..’
హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రాశి... ఆ తర్వాత హీరోయిన్‌గా మారి వరుస హిట్స్‌తో ఒక దశలో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన ఆమె, ఇప్పుడు మళ్లీ సీరియల్స్, సినిమాలతో రీఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 'జీవితంలో చేసిన ఓ పెద్ద తప్పు నా కెరీర్‌పై ప్రభావం చూపింది' అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన రాశి... 'నేను తప్పు చేశానని ఎప్పుడు ఫీలయ్యాను అంటే... నిజానికి ఫీలయ్యేలా చేశారు అంటే కరెక్ట్ అవుతుంది' అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె నిజం సినిమాను ప్రస్తావించారు.

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'నిజం' సినిమాలో తాను చేసిన నెగెటివ్ పాత్ర తనకు కొంత నెగెటివిటీ తీసుకొచ్చిందని రాశి చెప్పారు. 'నిజం' సినిమా కోసం తాను చాలా బరువు తగ్గానని, దాదాపు మేకప్ లేకుండా కేవలం కాజల్‌తోనే సినిమా మొత్తం నటించానని రాశి వెల్లడించారు.'నాకు ఇచ్చిన క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాననే సంతృప్తి మాత్రం నాకు ఉంది' అని స్పష్టం చేశారు.'నిజం సినిమా వల్ల నెగెటివ్ ఇమేజ్ వచ్చింది అనేది నా ఫీలింగ్. అది నిజమే అయ్యి ఉండొచ్చు' అంటూ ఆమె వివరించారు.
అదే సమయంలో కొంత పాజిటివ్ కూడా జరిగింది అంటూ ఆ సినిమా టైమ్‌లోనే చిరంజీవి గారితో ఒక సినిమా ఓకే అయిందని, ఆ ప్రాజెక్ట్‌కు నాగబాబు గారు ప్రొడ్యూసర్‌గా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, నాగబాబు గారు తనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలిపారు. ఆ సమయంలో నాగబాబు గారు తనను చూసి 'నీ స్కిన్ లోపల ఏమైనా ట్యూబ్ లైట్ పెట్టుకున్నావా?' అంటూ సరదాగా కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పడం అభిమానులను నవ్వించింది.
అదే సమయంలో చిరంజీవి గారితో సినిమా గురించి చర్చలు జరిగిన విషయాన్ని కూడా రాశి గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ఐ ట్రస్ట్‌కు తాను తన కళ్లను దానం చేశానని చెప్పినప్పుడు, 'ఇంతవరకు కళ్ళు దానం చేసిన ఆడవాళ్లలో మీరు మొదటివారు' అంటూ మెగాస్టార్ ప్రశంసించారని చెప్పారు. అంతేకాదు, త్వరలో ఓ సినిమా కూడా కలిసి చేయబోతున్నామని చిరంజీవి గారు స్వయంగా తనతో చెప్పారని, తన డ్యాన్స్‌పై కూడా కాంప్లిమెంట్ ఇచ్చారని రాశి భావోద్వేగంగా వెల్లడించారు. 'మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా నన్ను ప్రశంసించడం నా జీవితంలో మర్చిపోలేని క్షణం' అని చెప్పారు. ఈ విషయాన్ని హీరో శ్రీకాంత్ కూడా తనకు గుర్తు చేశారని తెలిపారు.
అయితే అందరూ ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆ చిరంజీవి ప్రాజెక్ట్ మాత్రం కొన్ని అనివార్య కారణాలతో సెట్ కాలేదని, చివరకు క్యాన్సల్ అయిందని రాశి తెలిపారు. అదే తన కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అయి ఉండేదని రాశి అభిప్రాయపడారు.. మొత్తానికి రాశి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఇంత ఓపెన్‌గా చెప్పడం అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తోంది. రీఎంట్రీ తర్వాత కూడా ఇలాంటి నిజాయితీ గల మాటలతో రాశి మరోసారి వార్తల్లో నిలిచారు.


Click it and Unblock the Notifications











