ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ నాశనం.. మండిపడ్డ తెలుగు హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో బాలనటిగా అడుగుపెట్టి, తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ఆమె. టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఆమె.. ఒకే సినిమా కారణంగా కెరీర్‌కు బ్రేక్ పడిందని స్వయంగా వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు చెప్పిన కథ ఒకటి, తెరపై చూపింది మరోటి అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ పాత్రే తన కెరీర్ నాశనం అయ్యిందనీ ఎమోషనల్ అయ్యింది. ఒకప్పుడు టాప్ హీరోల సరసన మెరిసిన ఈ నటి, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతోంది? ఇంతకీ ఆ నటి ఎవరు? అసలేం జరిగింది?

ఆ నటి ఎవరో కాదు.. అలనాటి స్టార్ హీరోయిన్ రాశి. తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించింది. రాశి చిన్ననాటి నుంచే సినిమాల్లోకి వచ్చి ఆదిత్య 369, పల్నాటి పౌరుషం వంటి సినిమాల్లో బాలనటిగా మెప్పించారు. అనంతరం తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, తెలుగులో గోకులంలో సీత, శుభాకాంక్షలు, పండుగ, సముద్రం వంటి సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. 90వ దశకంలో అగ్రనటిగా వెలుగొందిన ఆమె, వరుస విజయాలతో టాప్ హీరోయిన్‌గా నిలిచింది.

Raasi Throwback Interview Actress Says Mahesh babu Nijam film Destroyed Her Career Blames Director Teja

ఇక అయితే 2000 తర్వాత కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం, ఆ సమయంలో విభిన్న పాత్ర, ఒక సినిమా.. ఆమె భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఆ సినిమా ఏంటో కాదు.. నిజం (Nijam). ఈ చిత్రంలో మహేశ్ బాబు హీరోగా, గోపి చంద్ ప్రతినాయకుడిగా నటించగా, తేజా దర్శకత్వం వహించారు. సినిమాలో రాశి 'మల్లి' అనే నెగిటివ్ షేడ్ పాత్ర చేసింది.ఆ పాత్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినప్పటికీ, అదే పాత్ర ఆమెకు విమర్శలు కూడా తెచ్చిపెట్టిందట.

నటి రాశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నిజం' సినిమా విషయంలో ఆమెకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించింది. డైరెక్టర్ తేజ తనకు కథ చెప్పిన విధానం ఒకలా ఉండగా, షూటింగ్ సమయంలో తీసిన సన్నివేశాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.ముఖ్యంగా గోపీచంద్‌తో చేసిన కొన్ని రొమాంటిక్ సీన్లు తనకు అసహజంగా అనిపించాయని, మొదటి రోజే ఈ విషయాన్ని గ్రహించినప్పటికీ, అప్పటికే కమిట్ అయినందున వెనక్కి తగ్గలేకపోయానని తెలిపారు. ఈ పాత్ర వల్ల తనపై నెగిటివ్ ఇమేజ్ ఏర్పడిందని రాశి భావిస్తున్నారు.

ప్రేక్షకులలో కొంతమంది తనను అలా చూడటం ఇష్టపడలేదని, అదే తన కెరీర్‌పై ప్రభావం చూపిందని ఆమె పేర్కొన్నారు. నటిగా వచ్చిన పేరు, ఇమేజ్ ఒక్కసారిగా మారిపోవడం తనను మానసికంగా కూడా కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ సినిమా కోసం ఆమె భారీగా బరువు తగ్గడం, ప్రత్యేక ట్రైనింగ్ తీసుకోవడం వంటి అంశాలు కూడా తన ఆరోగ్యంపై ప్రభావం చూపాయనీ, పాత్ర కోసం చేసిన మార్పులు చివరకు తనకే నష్టంగా మారాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'ఒక పాత్ర కోసం చేసిన త్యాగం, జీవితాన్నే మార్చేసింది'అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక సినిమా తరువాత రాశి కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. 2005లో వివాహం చేసుకుని కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తల్లి పాత్రల్లో, అలాగే బుల్లితెరపై కూడా తన నటనను కొనసాగిస్తున్నారు. మొత్తంగా చూస్తే. ఒకే సినిమా, ఒకే పాత్ర తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసిందనీ నటి రాశి మండిపడ్డారు.

Read more about: rashi teja mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X