నగ్న వీడియో లీక్: రాధిక ఆప్టే ధీటైన జవాబు.. నా తల్లే..
బాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్లలో రాధిక ఆప్లే ఒకరు. ఏ విషయాన్నైనా దాచకుండా కుండ బద్దలుకొట్టినట్టుగా మాట్లాతుంటారు. దక్షిణాదిలో ఎదురైన వేధింపుల గురించి ఇటీవల నేహా దూపియా టాక్ షోలో మాట్లాడారు. అలాగే గతంలో లీకైన తన నగ్న వీడియో గురించి స్పందించారు. లీకైన వీడియో ఉదంతంపై మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంపై పెద్దగా ప్రభావం పడలేదన్నారు. ఇంకా ఏమన్నారంటే..
Recommended Video


షార్ట్ ఫిలిం వీడియో లీక్
దర్శకుడు అనురాగ్ బసు తీసిన మ్యాడ్‌లీ అనే షార్ట్ ఫిలింకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ మీడియాలో లీక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాట్సప్ గ్రూప్, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. మొదట నా డ్రైవర్ ఆ విషయాన్ని నా దృష్టికి తెచ్చాడు. ఈ వీడియోను స్వయంగా తన తల్లి తనకు పంపారని చెప్పారు.

నేను పెద్దగా పట్టించుకోను
వీడియో లీక్ వ్యవహారాన్ని నేహా దూపియ ప్రశ్నించగా.. ఓ నవ్వు నవ్విన రాధిక ఆప్టే.. ఇలాంటి విషయాలను నేను గానీ, నా కుటుంబం గానీ పెద్దగా పట్టించుకోలేదు. క్లిప్పును చూసి నా తల్లి చాలా తేలికగా తీసుకొన్నది. అలాంటి విషయాలు నాపై పెద్దగా ప్రభావం చూపవు అని రాధిక ఆప్టే పేర్కొన్నది.

తేలికగా తీసుకోవడం అలవాటై
వీడియో లీక్‌ను మీడియాలో పెద్దగా చూపాలని ప్రయత్నించారు. కానీ ఏమైంది. రెండు రోజుల తర్వాత అందరూ మరచిపోయారు. ఇప్పుడు కూడా ఏమైనా జరిగితే దానికంటే ఎక్కువగా చేయలేరు. అందుకే నాలో ధైర్యం పెరిగింది. అలాంటి ఘటన తర్వాత ఏం జరిగిన నాకు తేలికగా తీసుకోవడం అలవాటైపోయింది అని రాధిక ఆప్టే అన్నారు.

పార్చడ్ చిత్రంలో సెక్స్ సీన్ కూడా
రాధిక ఆప్టే నటించిన వీడియోలు లీక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2015లో పార్చడ్ చిత్రంలో ఆదిల్ హుస్సేన్‌తో నటించిన శృంగార సన్నివేశం కూడా లీక్ కావడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. లీక్ ఘటన రాధిక ఆప్టే పెద్దగా స్పందించలేదు. పట్టించుకోకపోవడంతో ఆ వివాదం అప్పుడే సమసిపోయింది.


Click it and Unblock the Notifications











