ఆ టాలీవుడ్ డైరెక్టర్ నన్ను అలా మోసం చేశాడు.. గంటల కొద్ది అలా.. రాధిక ఆప్టే ఫైర్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఆరోపణలు రావడం చాలా అరుదుగా మీడియాలో కనిపిస్తాయి. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ఆయన... విమర్శలకు, ఆరోపణలకు దూరంగా ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. అయితే బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఆర్జీవీపై చేసిన వ్యాఖ్యలు మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
అహనా కుమార హాట్ అండ్ స్పైసీ ఫొటోస్

రక్త చరిత్ర సినిమా షూట్‌లో
గతంలో వర్మ రూపొందించిన రక్త చరిత్ర సినిమాలో నటించాను. గ్రామీణ యువతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి చాలా కష్టపడ్డాను. ఓ దశలో నేను సినిమా నుంచి తప్పుకొందామనే ఫీలింగ్ కలిగింది. ఆ పాత్ర కోసం నాకు చాలా తక్కువగా రెమ్యునరేషన్ చెల్లించారు అంటూ ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే పేర్కొన్నారు.

ఒకే భాషలో అని చెప్పి..
రక్త చరిత్ర సినిమాలో రోల్‌ను ఆఫర్ చేసే ముందు నాకు ఒకే భాషలో తీస్తున్నామని చెప్పారు. కానీ షూటింగు సమయంలో తెలుగుతోపాటు తమిళంలో కూడా తీశారు. నాతో డబుల్ వర్క్ చేయించారు. అందుకు ఎక్కువ పని చేయాల్సి వచ్చింది. మరింత అంకితభావాన్ని చూపించాల్సి వచ్చింది అంటూ రాధికా ఆప్టే వెల్లడించారు.

స్టార్ హీరోలతో అలాంటి సమస్యలు
రక్త చరిత్ర సినిమాలో చాలా పెద్ద హీరోలు నటించారు. అయితే వారి వల్ల సమయానికి షూట్ స్టార్ట్ కాకపోయేది. నేను సమయానికి సెట్‌కు వెళితే.. హీరోలు టైమ్‌కు రాకపోయే వారు. సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని గంటల తరబడి సెట్లో వెయిట్ చేయాల్సి వచ్చేది. నా టాలెంట్‌ను కూడా తొక్కేశారు అంటూ రాధికా ఆప్టే ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

నా కెరీర్ గురించి అనేక సందేహాలు
రక్త చరిత్ర సినిమా చేసేటప్పుడు నా కెరీర్ ఏంటనే ప్రశ్న నా ముందుకు వచ్చింది. నా గురించి నేను బాగా ఆలోచించుకొన్నాను. టాలీవుడ్‌లో వ్యవహారం ఇలానే ఉంటుందని నాకు నేను సర్ధి చెప్పుకొన్నాను అని రాధిక ఆప్టే పేర్కొన్నారు.
Recommended Video

ఆర్జీవి గురించి చాలా విషయాలు
రక్త చరిత్ర సినిమా షూటింగ్ సమయంలో చాలా విషయాలు ఆసక్తికరంగా రాంగోపాల్ వర్మ నుంచి నేర్చుకొన్నాను. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా సరదాగా గడిచిపోయేది. టాలీవుడ్‌లో ఫేవరిటిజం, టైమ్‌ను దుర్వినియోగం చేయడం బాగానే కనిపించాయి. ఇలాంటి అంశాలు ఏ ఒక్క పరిశ్రమకు పరిమితం కాదనిపించింది అని రాధికా ఆప్టే తెలిపారు.


Click it and Unblock the Notifications











