రాధికా ఆప్టే మరీ పచ్చిగా.. స్విమ్ సూట్లో హాట్‌హాట్‌గా
బాలీవుడ్ అందాల తార రాధికా ఆప్టే బోల్డ్‌గా నటించడంలోనూ, కనిపించడంలోనూ తనకు తానే సాటి. ఏదైనా మాట్లాడాల్సి వస్తే జంకు, బొంకు లేకుండా కుండ బద్దలుకొట్టినట్టు మాట్లాడుతుంది. అలాగే పాత్ర డిమాండ్ చేస్తే ఎంతకైనా తెగిస్తుంటారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాధికా ఆప్టే టూ పీస్ స్విమ్ సూట్‌లో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సన్నివేశం ఏ సినిమా కోసం అంటే..

ఇంగ్లీష్ మూవీ కోసం
రాధికా ఆప్టే ప్రస్తుతం ది వెడ్డింగ్ గెస్ట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్, జిమ్ సరభ్‌తో కలిసి నటిస్తున్నది. ఈ సినిమాలో ఓ సన్నివేశం డిమాండ్ చేయడంతో బికినీలో రాధిక హాట్‌గా కనిపించిందట.

ది వెడ్డింగ్ గెస్ట్ కథ ఇదే
పాకిస్థాన్, ఇండియాలో ఓ బ్రిటీష్ వ్యక్తి జీవిత ప్రయాణం కథతో ది వెడ్డింగ్ గెస్ట్ అనే సినిమా రూపొందుతున్నది. రాధికా ఆప్టే ఈ చిత్రంలో సమీరా అనే పాత్రలో కనిపిస్తుంది. జై పాత్రలో దేవ్ నటిస్తున్నాడు. ఓ గ్రామంలో ఉండే సమీరాను కిడ్నాప్ చేసే పాత్రను దేవ్ పోషిస్తున్నాడు.
గోవాలో స్విమ్ సూట్‌లో రాధిక
ది వెడ్డింగ్ గెస్ట్ సినిమా సన్నివేశాలను న్యూఢిల్లీ, గోవా, దేశ సరిహద్దు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. రాధికా ఆప్టే బికిని సీన్‌ను గోవాలో చిత్రకరించారు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో విమర్శకుల ప్రశంసలు
ది వెడ్డింగ్ గెస్ట్ చిత్రానికి బ్రిటన్‌కు చెందిన మైఖేల్ వింటర్‌బాటమ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఇటీవల టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవ్ పటేల్, రాధికా ఆప్టే నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిసాయి.


Click it and Unblock the Notifications











