నిన్ను అలా చూడాలని ఉంది. హోటల్‌కు తీసుకెళ్లి.. దక్షిణాదిలో డైరెక్టర్‌తో చేదు అనుభవం.. రాధిక ఆప్టే

Recommended Video

Radhika Apte About South Indian Film Industry

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల విషయాన్ని అందాల నటి రాధిక ఆప్టే బయటపెట్టింది. సాధారణంగా తనకు అన్యాయం జరిగితే తడుముకోకుంండా మాట్లాడే ఆమె పలు సంచలన విషయాలను చెప్పింది. తనను ఆడిషన్‌కు పిలిచి దారుణంగా ట్రీట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ప్రసారమైన నటి నేహా దూపియా షోకు హాజరైన రాధిక ఆప్టే తాను అనుభవించిన కష్టాలను వెల్లడించింది. అయితే దక్షిణాది చిత్రపరిశ్రమ అనే పేర్కొన్నప్పటికీ.. తమిళమా? తెలుగు సినిమా పరిశ్రమలో జరిగిందనే విషయం చెప్పకపోవడం గమనార్హం. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

హోటల్‌కు తీసుకెళ్లాడు

హోటల్‌కు తీసుకెళ్లాడు

లండన్‌లో ఓ సినిమా షూటింగ్ నుంచి అప్పుడే ముంబైకి వచ్చాను. ఓ డైరెక్టర్ ఫోన్ చేసి అర్జెంట్‌గా ఆడిషన్‌కు రమ్మన్నాడు. మీకు హోటల్ రూం బుక్ చేస్తాం. ఆ డైరెక్టర్ పేరు కూడా గుర్తులేదు. ఓ నాసిరకం హోటెల్‌కు తీసుకెళ్లారు. ఆ హోటల్ పరిస్థితి చెప్పలేనంత చాలా దారుణంగా ఉంది. దేవుడా ఆ ఆడిషన్‌లో చాలా డ్రామా నడించింది. అయితే దేవుడి దయవల్లనో ఏమో ఆ సినిమా సెట్స్‌లోకి వెళ్లలేదు అని రాధిక చెప్పింది.

 జాకెట్ కొలతల కోసం పిలిచి

జాకెట్ కొలతల కోసం పిలిచి

ఆడిషన్ విషయానికి వస్తే అసలేం జరిగిందో నేను చెప్పాల్సిందే. ఆడిషన్‌కు అని పిలిచి ఏదో ఏదో చేశారు. నా జాకెట్ కొలుతలు తీసుకోవడానికి టైలర్‌తోపాటు 12 మంది వచ్చారు. వారు వచ్చి చిన్న జాకెట్‌లాంటిది ఇచ్చి వేసుకోమన్నారు. దానిని ధరించగానే ఫోటోలు తీయడం ప్రారంభించారు. ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి అని రాధిక చెప్పారు.

విక్రమ్ సినిమా కోసమని

విక్రమ్ సినిమా కోసమని

వాస్తవానికి ఆ సినిమా చారిత్రాత్మక నేపథ్యంగా రూపొందాల్సింది. ఆ భారీ బడ్జెట్ సినిమాలో విక్రమ్ హీరో. ఆడిషన్‌లో భాగంగా ఆ డైరెక్టర్ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు. నిన్ను అన్ని కోణాల్లో, అన్నీ రకాలుగా పరీక్షించాలి అంటూ అదోలా నవ్వాడు. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చిన ఓపిక పట్టాను.అని రాధిక చెప్పారు.

 నాకు కొన్ని డ్యాన్స్ మూమెంట్లతో

నాకు కొన్ని డ్యాన్స్ మూమెంట్లతో

ఆడిషన్‌లో భాగంగా కొన్ని చెత్త డ్యాన్స్ మూమెంట్లు చెప్పారు. ఆ సినిమాకు ఆ డ్యాన్సులకు సంబంధమేమిటో అర్ధం కాలేదు. నేను మూమెంట్స్ చేస్తుండగానే రకరకాలుగా ఫొటోలు తీశారు. ఆ తర్వాత ఆ ఫొటోలు ఏమయ్యాయో కూడా తెలియవు. ఆ తర్వాత ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే అటకెక్కింది అని వెల్లడించారు.

 మళ్లీ దక్షిణాది మొహం చూడొద్దని

మళ్లీ దక్షిణాది మొహం చూడొద్దని

నేను ఈ హోటల్‌లో ఉండలేను. ఈ రాత్రికి తిరిగి వెళ్లిపోవాలని ఆ రోజే డైరెక్టర్‌కు చెప్పాను. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చేశాను. అప్పుడే మారోసారి దక్షిణాది గడప తొక్కద్దని అనుకొన్నాను అని రాధిక ఆప్టే తనకు జరిగిన అనుభవాన్ని పూసగుచ్చినట్టు నేహా దూపియాకు చెప్పుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X