తప్పు జరిగిపోయింది .. నెల తప్పా , షాకింగ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
మాతృత్వం అనేది ఆడవాళ్లకు భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరం. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే స్త్రీ జీవితం పరిపూర్ణం అవుతుందని అంటారు. అందుకే పెళ్లయిన మహిళలు వెంటనే తల్లి కావాలని ఆశిస్తుంటారు. అయితే కొందరు మాత్రం గర్భం దాలిస్తే తమ అందం తరిగిపోతుందని, శరీరం మారిపోతుందని భయపడుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఈ మధ్య కాలంలో సరోగసి విధానంలో పిల్లలను కంటున్నారు.
సామాన్యులే పరిస్ధితే ఇలా ఉంటే గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా రంగంలో ఉన్న హీరోయిన్ల పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ కెరీర్ నాలుగు కాలాల పాటు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది భామలు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒకవేళ తప్పనిసరి పరిస్ధితుల్లో పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లల్ని కనేందుకు మాత్రం గ్యాప్ తీసుకుంటారు. ఇంకొందరు సరోగసి, ఇతర మార్గాల ద్వారా పిల్లలను కంటున్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలో కాంట్రవర్సియల్ కామెంట్స్ చేయడానికి, వివాదాలు రేపడానికి కొంతమంది హీరోయిన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఎవరు ఏమనుకున్నా సరే, వాళ్లు చెప్పాల్సింది నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు. ఈ కోవలోకే వస్తారు ఫైర్ బ్రాండ్ రాధిక ఆప్టే. ఆమె ఏం మాట్లాడినా, ఏం చేసినా అది సంచలనం అవుతుంది. ఈ మరాఠీ ముద్దుగుమ్మ తెలుగులో రక్త చరిత్ర, ధోని, లెజెండ్, లయన్ తదితర సినిమాలలో నటించి ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలలో పలు సినిమాలు చేశారు.
భారతదేశంలో మీటూ , క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాలు ఉద్ధృతంగా సాగిన రోజుల్లో రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు చిత్ర సీమలో దుమారం రేపాయి. తన కెరీర్‌లో పలుమార్లు క్యాస్టింగ్ కౌచ్ బారినపడ్డానని ఆమె వ్యాఖ్యానించారు. అవకాశాల కోసం తానెప్పుడూ అడ్డదారి తొక్కలేదని.. కానీ ఓ దక్షిణాది నటుడు మాత్రం తనకు ఫోన్ చేసి తన గదిలోకి రమ్మని పిలిచాడని రాధిక ఆప్టే బయటపెట్టారు. దాంతో తాను అప్పటికప్పుడే అతనికి గట్టిగా బుద్ధి చెప్పానని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
అవసరం అనేది మనిషిని ఏ స్థాయికైనా దిగజారుస్తుందని.. సినిమా వాళ్ల పరిస్ధితి ఈ విషయంలో మరింత దారుణంగా ఉంటుందని రాధిక అన్నారు. లయన్ తర్వాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. కానీ పలు బాలీవుడ్ చిత్రాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 2012లో బ్రిటీష్ జాతీయుడైన బెనెడిక్ట్ టేలర్‌ను ప్రేమించి పెళ్లాడారు రాధిక ఆప్టే.. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె గర్భవతి అయిన తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.

అయితే పిల్లల విషయంలో తాము ఎలాంటి ప్లాన్ చేసుకోలేదని.. గర్భవతిని అయ్యానని తెలిసిన వెంటనే కంగారుపడ్డానని రాధిక ఆప్టే పేర్కొన్నారు. ప్రెగ్నెంట్ అయిన నాటి నుంచి లావుగా తయారయ్యానని .. డెలివరి తర్వాత శరీరంలో కొత్త మార్పులు వచ్చాయని ఆమె తెలిపారు. ఓ మహిళ ప్రెగ్నెంట్ కావడం అనేది సులభమైన విషయం కాదని.. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని , కానీ మాతృత్వం అనేది అందమైన అనుభవమని రాధిక ఆప్టే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











