అర్థరాత్రి వస్తా.. నడుము మాసాజ్ చేస్తా అన్నాడు.. రాధికా ఆప్టే సంచలనం!

రాధికా ఆప్టే మంచి ప్రతిభ కలిగిన నటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రక్త చరిత్ర, లెజెండ్ వంటి చిత్రాలతో తెలుగులో గుర్తింపు పొందింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. పార్చెడ్ అనే చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం రేపింది. ప్రతిభకు తగ్గట్లుగానే రాధికా ఆప్టే చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. బోల్డ్ గా నటించడమే కాదు బోల్డ్ గా మాట్లాడే నైజం కూడా ఈ అమ్మడిది. కాస్టింగ్ కౌచ్, మహిళా నటులపై వేధింపులు వంటి విషయాల గురించి అవకాశం ఉన్నప్పుడల్లా రాధికా ఆప్టే గళం వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆంగ్ల మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇంటర్ నెట్ సెన్సేషన్

ఇంటర్ నెట్ సెన్సేషన్

ఇప్పుడు సినిమా నటిగా కన్నా ఇంటర్ నెట్ లో ఎక్కువగా రాధికా సెన్సేషన్ అవుతోంది. ఆమె బోల్డ్ కామెంట్స్ ఒక ఎత్తైతే, నెట్ ఫ్లిక్స్ ద్వారా కూడా రాధికా హాట్ టాపిక్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ కి సంబందించిన ఆమె మెమేలు వైరల్ అవుతున్నాయి.

 మీటూ మూమెంట్

మీటూ మూమెంట్

హాలీవుడ్ లో మీ టూ మూమెంట్ సంచలనంగా మారిన సందర్భంలో బాలీవుడ్ నటీమణులు కూడా ఆమెకు ఎదురైనా చేదుఅనుభవాలని, వేధింపులని ధైర్యంగా వెల్లడించాలని రాధికా ఆప్టే తెలిపింది. అప్పట్లో తనకు ఎదురైన కొన్ని సంఘటనలు కూడా వివరించింది.

మీడియా కార్యక్రమంలో

మీడియా కార్యక్రమంలో

తాజాగా మరోమారు రాధిక బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో మీ టూ కార్యక్రమం ఎందుకు హీరోయిన్లకు, నటీమణులకు చేరువ కావడంలేదు వివరించింది. ఆంగ్ల మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో రాధిక ఈ వ్యాఖ్యలు చేసింది.

షూటింగ్ ముగించుకుని

షూటింగ్ ముగించుకుని

ఓ చిత్ర షూటింగ్ సమయంలో నాకు నడుము నొప్పి వచ్చింది. అయినా భరిస్తూ ఆ రోజు షూటింగ్ ముగించా. చివరి టేక్ పూర్తయిన తరువాత నా రూమ్ కు బయలుదేరా. అదే చిత్రంలో నటిస్తున్న మరో నటుడు లిఫ్ట్ లో నాతో పాటు ఎక్కాడు అని రాధికా తెలిపింది.

మాట్లాడలేదు

మాట్లాడలేదు

ఆ నటుడితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మా ఇద్దరికీ పరిచయం లేదు. కానీ లిఫ్ట్ లో అతడు చేసిన వ్యాఖ్యలు నాకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. అతడి మాటలని రాధికా ధైర్యంగా వివరించింది.

అర్థరాత్రి సాయం చేస్తా

అర్థరాత్రి సాయం చేస్తా

ఏదైనా సాయం కావాలంటే చెప్పు.. అర్థరాత్రి అయినా వచ్చి నడుము మసాజ్ చేస్తా అని అసభ్యంగా మాట్లాడాడు అని రాధికా తెలిపింది. చిత్ర యూనిట్ లో చాలా మంది మంచివారు ఉన్నారు. వారికి ఈ విషయం వివరించా అని రాధికా తెలిపింది.

వాతావరణం అలాంటిది

వాతావరణం అలాంటిది

చిత్రయూనిట్ లోని పెద్దవారు అతడిని పిలిచి మందలించారు. ఆ తరువాత అతడు వచ్చి క్షమాపణ చెప్పాడు. అతడు నాతో మాట్లాడిన మాటలు ఎంత అసభ్యకరమైనవో అతడికి తెలియదు. ఎందుకంటే అతడు పెరిగిన వాతావరణం అలాంటిది అని రాధిక తెలిపింది. ఇలాంటి చోట మీ టూ లాంటి ఉద్యమం చాలా బలంగా ఉండాలని రాధికా కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X