అతిగా బీర్లు సేవించి... సినిమా ఛాన్స్ పోగొట్టుకున్న హీరోయిన్!
బీరు ప్రియులు... ఆ పానీయం కనిపిస్తే తాగకుండా ఉండలేరు. అయితే ఏదైనా అతిగా తీసుకుంటే అనర్థాలు తప్పవు. అయితే రోజూ బీర్లు సేవించి లావెక్కి పోయిన ఓ హీరోయిన్ చివరకు సినిమాలో నటించే అవకాశం కోల్పోయింది. ఆవిడ మరెవరో కాదు... తెలుగులో బాలయ్యతో పలు చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే.
ఇటీవల ఓ ఛాట్ షోలో పాల్గొన్న రాధిక ఆప్టే ఈ విషయం వెల్లడించారు. అతిగా బరువు పెరగడం వల్ల 'విక్కీ డోనర్' అనే సినిమాలో నటించే అవకాశం కోల్పోయినట్లు తెలిపారు. అప్పటి నుంచి తన వెయిట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందట.

బీర్లు తాగుతూ బాగా తిన్నా
‘ఓసారి నెల రోజుల పాటు హాలిడే వెళ్లాను. ఆ సమయంలో బాగా బీర్లు సేవించాను, ఫుడ్ కూడా ఎక్కువ తీసుకున్నాను. దీంతో బరువు పెరిగాను. తన లుక్ సినిమాకు సరిపోయే విధంగా లేదని తప్పించారు. బరువు తగ్గి వస్తానని చెప్పినా నిర్మాతలు వినిపించుకోలేదు' అని రాధి ఆప్టే తెలిపారు. రాధిక ఆప్టే పోగొట్టుకున్న ‘విక్కీ డోనర్' ఛాన్స్ యామి గౌతమ్ దక్కించుకున్నారు.

నిర్మాతల చర్యను సమర్ధించిన హీరో
ఇదే చాట్ షోలో పాల్గొన్న ‘విక్కీ డోనర్' మూవీ హీరో ఆయుష్మాన్ ఖురానా... ఆ సమయంలో నిర్మాతలు తీసుకున్న చర్యను సమర్దించారు. ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉన్నాను, నాతో పాటు నటించే పెయిర్ కూడా సూటయ్యేలా ఉండాలనే ఉద్దేశ్యంతో బరువు ఎక్కువగా ఉన్న రాధిక ఆప్టేను తప్పించినట్లు తెలిపారు.

అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నా
‘విక్కీ డోనర్' మూవీ నిర్మాతలు అలా చేయడంతో చాలా కోపం వచ్చింది. కానీ పరిస్థితి నా చేయి దాటిపోవడంతో ఏమీ చేయలేక పోయాను. అప్పటి నుంచి డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఆ తర్వాత ఎప్పుడు బరువుకు సంబంధించిన సమస్య ఎదుర్కోలేదని తెలిపారు.

రాధిక ఆప్టే మూవీస్
‘రక్త చరిత్ర' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాధిక ఆప్టే.. బాలయ్యతో కలిసి లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘ది ఆశ్రమ్' అనే ఇండియన్-అమెరికన్ ఫాంటసీ మూవీతో పాటు, ‘ది వెడ్డింగ్ గెస్ట్' అనే బ్రిటిష్-అమెరికన్ యాక్షన్ మూవీలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











