పెద్దవి కాదని నన్ను రిజెక్ట్ చేశారు.. నమ్మిన వాళ్ళే చేస్తే ఏమనాలి .. రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్!

వివాదాలకు, బోల్డ్ కంటెంట్‌లకు కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది రాధికా ఆప్టే. తమిళ, తెలుగు భాషల్లో కొన్ని సినిమాల్లో ఫేమస్ అయిన ఈ భామ హిందీలోనూ సత్తా చాటింది. నటించడంలోనూ, అందాలను ఆరబోయడంలోనూ హద్దులు చేరిపేసిన ఈ భామ వివాదాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా న్యూడ్‌గా కూడా నటించేసిన ఈ భామ.. తాజాగా మరో సంచలన ఆరోపణతో ముందుకు వచ్చింది. ఆ వివరాలు

నగ్నంగా

నగ్నంగా

'రక్త చరిత్ర', బాలయ్యతో 'లెజెండ్', 'లయన్', ప్రకాష్ రాజ్ హీరోగా వచ్చిన ధోని సినిమాలో కూడా నటించి మెప్పించింది. తెలుగు నాట మంచి క్రేజ్ ఉన్నా గానీ ప్రస్తుతం ఆమె తెలుగు ప్రేక్షకుల వైపు చూడటం లేదు. రాధికా ఆప్టే ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతోనే బిజీగా ఉంటోంది. 'వెడ్డింగ్ గెస్ట్' సినిమాలో నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది రాధికా ఆప్టే. ఇక ఈ సినిమా గురించి ఆమె అనేక విషయాలు ఆమె గతంలో వెల్లడించింది.

రిజెక్ట్ చేశారు

రిజెక్ట్ చేశారు

17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత, ఆమె తన ఎద భాగం అలాగే పెదాలు చిన్నగా ఉన్నందున ఎలా తిరస్కరించబడ్డానో ఈ బ్యూటీ ఇప్పుడు వెల్లడించింది. రాధికా ఆప్టే తాజాగా మిడ్-డేతో మాట్లాడుతూ, "వేరే నటికి పెద్ద పెదవులు, నా కన్నా ఎద భాగం పెద్దగా ఉన్నందున నన్ను ఇటీవల రిజెక్ట్ చేశారు'' అని రాధికా ఆప్టే వెల్లడించింది.

రిజెక్ట్ చేశారు

రిజెక్ట్ చేశారు

'ఆమె నాకంటే ఎక్కువగా సెక్సీగా కనిపిస్తుందట, అందుకే ఆమెకు ఎక్కువ సేలబిలిటీ ఉంటుందని అన్నారు అని రాధికా పేర్కొంది. నేను గౌరవించే వ్యక్తులు చేసిన మంచి సినిమాలో నేను కూడా భాగం అవుదాం అనుకున్నాం. మనం అభిమానించే వ్యక్తులు ఇలాంటి వాళ్ళే అని అనుకోలేదు, కానీ వారు కూడా అలాంటి మనస్తత్వమే కలిగి ఉంటారని ఆమె అన్నారు. అందుకే ఆ స్థాయిలో నిర్ణయం తీసుకునేలా మహిళలు ఉంటె కనుక మరిన్ని విషయాలు మారతాయని అన్నారు.

కొత్తగా వచ్చినప్పుడు

కొత్తగా వచ్చినప్పుడు

రాధికా ఆప్టే గతంలో కూడా కొందరు తనను ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాలని కోరినట్లు వెల్లడించారు. పరిశ్రమకు కొత్తగా వచ్చినప్పుడు.. నా శరీరాకృతి పరంగా ముఖం పరంగా చాలా మార్పులు చేయాలని చెప్పేవారని ఆమె అన్నారు. మొదట నా ముక్కును మార్చుకోవాలని అన్నారు, తర్వాత ఎద భాగం పెంచుకోవాలని కొందరు అడిగారు, కాళ్ల సౌందర్యం కోసం ఏదైనా చేయమని.. ఆపై దవడలకు ఏదైనా చేయించాలని కూడా చెప్పారని అన్నారు.

ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే

ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే


అయితే నేను కనీసం ఇంజెక్షన్ కూడా తీసుకోను, అందుకే ఆ విషయంలో నేను వెనుక పడ్డానని ఆమె పేర్కొంది. ఇక ఇలాంటి సలహాలిచ్చేవాళ్లపై తనకు చాలా కోపం అని ఆమె వెల్లడించింది. రాధిక ఆప్టే ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే నవాజుద్దీన్ సిద్ధిఖీ రాత్ అఖేలీ హైలో ఆమె చివరిగా కనిపించింది. ఆమె ఇప్పుడు ఫోరెన్సిక్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ లో ఆమె విక్రాంత్ మాస్సేతో కలిసి నటించింది. ఈ చిత్రాన్ని 24 జూన్ 2022న ZEE5లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X