ఆదుకున్నారు, ఆ తరువాత వాడుకున్నారు.. అప్పుల్లో రాధికా ఆప్టే, ఏం చెప్పిందంటే!
ఎక్కువగా వివాదాల్లో నిలిచే హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు. ఎలాంటి విషయాన్ని అయినా తటపటాయించుకోకుండా చెప్పేయడం ఈ హాట్ బ్యూటీ నైజం. సినిమాల్లో అని రకాల బోల్డ్ రోల్స్‌లో నటించి మెప్పించింది. రాధికా ఆప్టే శృంగార భరిత సన్నివేశాల్లో సైతం నటించి సంచలం సృష్టించింది. ఆమె నటించిన కొన్ని వీడియోలు తీవ్ర వివాదాన్ని రేపాయి. కానీ రాధికా మాత్రం తాను చేయాలనుకున్న పని చేస్తూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా ప్రస్తావించే రాధికా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

రక్త చరిత్ర చిత్రంతో
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన హిట్ చిత్రం రక్త చరిత్రతో రాధికా ఆప్టే హీరోయిన్ గా పరిచయం అయింది. రక్త చరిత్ర అద్భుత విజయం సాధించడంతో రాధికకు దక్షిణాదిలో మంచి అవకాశాలు వచ్చాయి. దీనితో సౌత్ లో రాధికా క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. రాధికా ఆప్టే ఆ తరువాత ధోని, లెజెండ్, లయన్ లాంటి చిత్రాల్లో నటించే అవకాశం ఆడుకుంది.

ఇండస్ట్రీలోకి రాకముందు
తాను ఇండస్ట్రీలోకి రాకముందుకు లండన్‌లో చదువు కొనసాగిస్తూ మోడలింగ్ చేసేదానిని. ఆ సమయంలో చదువు కోసం తీవ్రంగా అప్పుల్లో కురుకుపోయా. బ్యాంక్ రుణం కూడా తీర్చలేని పరిస్థితి. అలాంటి సమయంలో రక్తచరిత్ర చిత్రం తన జీవితానికి ఎంతగానో ఉపయోగపడిందని రాధికా తెలిపింది. ఆ చిత్రం తరువాత నటిగా రాణించా. అప్పులు కూడా తీర్చేశా అని రాధికా పేర్కొంది.

వాడుకున్నారు
సౌత్ ఇండస్ట్రీ నన్ను ఎంతగా ఆదుకుందో, అదే స్థాయిలో వాడుకున్నారు అని కూడా రాధికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. గతంలో సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఓ స్టార్ హీరో తనని పడక గదిలోకి తీసుకుని వెళ్లి వేధించాడని రాధికా ఆరోపించిన సంగతి తెలిసిందే. సౌత్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది అని రాధికా ఆరోపించింది.

సౌత్‌లో నటించను
కాస్టింగ్ కౌచ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సమయంలో రాధికా మాట్లాడుతూ తాను ఇక సౌత్‌లో నటించను అని తేల్చి చెప్పేసింది. కానీ తాజాగా వ్యాఖ్యానిస్తూ.. తన కెరీర్‌కు కీలక దశలో ఉపయోగపడిన దక్షణాది చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎప్పుడూ ప్రత్యేక అభిమానం ఉంటుంది చెప్పింది. ప్రస్తుతం రాధికకు అవకాశాలు బాగా తగ్గాయి. అందుకే మళ్ళీ దక్షణాది చిత్ర పరిశ్రమపై కన్నేస్తుందని వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











