For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీర్లు తాగడం వల్ల అవకాశం పోయింది.. అసభ్యకర చిత్రాలు చేయడానికి కారణం ఇదే: రాధిక

|
Radhika Apte Comments On Her Hot Movies

రాధిక ఆప్టే.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దీనికి ఆమె చేసిన సినిమాలతో పాటు, తలెత్తిన వివాదాలూ కారణమే. ఈమె ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా వివాదంలో దూరకుండా ఉండదు. అందుకే ఈమె దేశం మొత్తానికి యాక్టర్‌గా కంటే వివాదాస్పద సెలెబ్రిటీగా బాగా సుపరిచితురాలు అయిపోయింది. ఇప్పటికే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. దీనికి కారణం ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలే.

కాస్టింగ్ కౌచ్‌తో మొదలు

కాస్టింగ్ కౌచ్‌తో మొదలు

తెలుగులో ‘రక్త చరిత్ర', ‘లెజెండ్', ‘లయన్' వంటి సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే.. దక్షిణాది భాషల్లోని చాలా సినిమాల్లో నటించింది. తక్కువ వ్యవధిలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే, కొద్దిరోజుల క్రితం ఆమె దక్షిణాదిలోని ఓ నటుడు తనను కోరిక తీర్చమన్నాడని ఆరోపణలు చేసి కలకలం రేపింది.

నగ్నంగా నటించి షాకిచ్చింది

నగ్నంగా నటించి షాకిచ్చింది

రాధిక ఆప్టే గురించి దేశ వ్యాప్తంగా తెలిసింది మాత్రం ‘పర్చేడ్' అనే సినిమా ద్వారానే. దీనికి కారణం అందులో రాధిక నగ్నంగా నటించింది. అప్పుడు ఈ సినిమా విడుదలకు ముందే దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అప్పుడు ఆమె గురించి అందరూ చర్చించుకోవడం స్టార్ట్ చేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

రాధిక ఆప్టే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తన వ్యక్తిగత వివరాలతో పాటు ఫొటోలు, వీడియోలు తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే పలు విషయాల పైనా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తన హాట్ హాట్ ఫొటోలతో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంటోంది.

బీరు తాగడం వల్లే మిస్ అయ్యా

బీరు తాగడం వల్లే మిస్ అయ్యా

రెండు రోజుల క్రితం రాధిక ఆప్టే తన 34వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. ‘నేను.. ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘విక్కీ డోనర్ (తెలుగులో నరుడా.. డోనరుడా)' అనే సినిమాలో నటించాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో బీర్ తగుతుండడం వల్ల నేను బాగా బరువు పెరిగాను. దీంతో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది' అని వెల్లడించింది.

అసభ్యకర చిత్రాలు అందుకే చేశా

అసభ్యకర చిత్రాలు అందుకే చేశా

అలాగే, తాను అసభ్యకర చిత్రాల్లో నటించానని కూడా ఒప్పుకుంది. ‘నేను కొన్ని అసభ్యకర చిత్రాల్లో నటించాను. దీనికి కారణం డబ్బే. అవును.. డబ్బు కోసం అలాంటి సినిమాలు చేశాను. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం నేను చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాను' అని రాధిక చెప్పుకొచ్చింది.

English summary
Radhika Apte is an Indian theater and film actress. Born in Vellore, Tamil Nadu, brought up in Pune, Maharashtra, Apte began acting in theatre She made her feature film debut with a brief role in the Hindi fantasy Vaah! Life Ho Toh Aisi!.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more