ఆ సౌత్ షూటింగ్‌లో అలా నీచంగా ప్రవర్తించారు.. ఒంటరిగా చేసి.. రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే (Radhika Apte)గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)సరసన లెజెండ్, లయన్ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన రాధికా ఆప్టే, బాలీవుడ్‌లోనూ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. బోల్డ్ పాత్రలు, ఓపెన్ అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలిచే ఈ హీరోయిన్, తాజాగా సౌత్ ఫిల్మీ ఇండస్ట్రీలో తాను చేదు అనుభవం ఎదుర్కొన్నననీ, ఓ సినిమా సెట్స్‌ లో ఎదుర్కొన్న అవమానాలను వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

రాధికా ఆప్టే తన సినీ ప్రయాణాన్ని మరాఠీ సినిమాలతో ప్రారంభించారు. ఆ తర్వాత హిందీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన ఆమె, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న రాధిక, ఆ తర్వాత రక్త చరిత్ర 2, లెజెండ్, లయన్, కబాలి వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా, తన పాత్రలకు న్యాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే నటి అన్న పేరు సంపాదించారు.

Radhika Apte Shocking Revelation Faced Harassment and Humiliation on South Indian Film Sets

అయితే రాధికా కెరీర్‌లో సినిమాల కంటే కూడా ఆమె చేసిన వ్యాఖ్యలే ఎక్కువగా చర్చకు దారి తీస్తుంటాయి. పార్చ్డ్, ది వెడ్డింగ్ గెస్ట్ వంటి చిత్రాల్లో బోల్డ్ సన్నివేశాల్లో నటించడం, మహిళలపై జరుగుతున్న వివక్ష, సినిమా సెట్లలో ఎదురయ్యే అన్యాయాలపై ఆమె బహిరంగంగా మాట్లాడటం వల్ల పలు వివాదాలకు కేంద్రబిందువయ్యారు. గతంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో తాను గర్భవతిగా ఉన్నప్పటికీ నిర్మాతల నుంచి కనీస మానవత్వం లభించలేదని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి.

ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. తాజాగా విడుదలైన సాలీ మొహబ్బత్ (Saali Mohabbat)ప్రమోషన్స్‌లో భాగంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను రాధికా ఆప్టే వెల్లడించారు. 'ఆ సినిమా సెట్స్‌లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. నాకు తోడు ఇంకొక మహిళ కూడా లేదు. నేను ఒంటరిగా ఉన్నాను. అక్కడ వారు నా శరీరాకృతిపై వ్యాఖ్యలు చేస్తూ.. బట్‌టోక్స్, బ్రెస్ట్‌లకు మరింత ప్యాడింగ్ చేయాలని అడిగేవారు. 'అమ్మా... ఇంకొంచెం ప్యాడింగ్' అంటూ మాట్లాడేవారు" అని ఆమె తెలిపారు.

ఈ సంఘటనలు తనకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించాయని రాధికా చెప్పుకొచ్చారు. 'ఆ సమయంలో నాకు డబ్బు చాలా అవసరం. అందుకే ఆ పాత్రలను అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆ సెట్స్‌లో ఒంటరిగా ఉండటం, అక్కడి వాతావరణం.. ఇవన్నీ చాలా కష్టంగా మారాయి. అవి నన్ను మానసికంగా గాయపరిచాయి'అని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు.

రాధికా ఆప్టే ఇంతకు ముందు కూడా వర్క్‌ప్లేస్‌లో హరాస్మెంట్‌కు గురైన సంఘటనలను బహిరంగంగా వెల్లడించారు. 2018లో ఓ సహనటుడు తనతో అవమానకరంగా ప్రవర్తించినప్పుడు, ఆ వ్యక్తిని తాను ఎదిరించిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. 'నేను ఎప్పుడూ మరొక మహిళ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొనకుండా ఉండాలని కోరుకుంటాను' అని ఆమె అన్నారు. అంతేకాదు, తన తొలి సినిమా రోజులను గుర్తుచేసుకుంటూ, మొదటి సినిమా నిర్మాతలు తనకు డబ్బులు కూడా ఇవ్వలేదని రాధికా తెలిపారు. తన తల్లితో కలిసి ఒప్పందంపై సంతకం చేయమని అడిగారని, అప్పట్లో 'ఊర్మిళ మటోండ్కర్ వంటి స్టార్ హీరోయిన్ కూడా కాంట్రాక్ట్‌పై సైన్ చేయలేదు' అంటూ తమను భయపెట్టే ప్రయత్నం చేశారని వెల్లడించారు.

ఇదిలా ఉంటే సాలీ మొహబ్బత్ సినిమా డిసెంబర్ 12, 2025న ZEE5 ప్లాట్‌ఫార్మ్‌పై విడుదలైంది. ఈ సినిమాలో రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు ఫిల్మీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే లైంగిక వివక్ష, అవమానాలపై మరోసారి చర్చ మొదలయ్యేలా చేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: radhika apte bollywood tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X