ఆ భయం వెంటాడుతున్నది.. ప్రతీక్షణం జీవన్మరణ సమస్యే.. రాధిక ఆప్టే
అందాల తార రాధికా ఆప్టే గత దశాబ్ద కాలంగా విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. తెలుగు, మరాఠీ, హిందీ, ఆంగ్ల భాషల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొంటూ ముందుకు సాగుతున్నారు. తనకు లభించిన విజయాలు నన్ను ఎక్కువ కాలం గుర్తుంచుకొనేలా చేశాయని తాజా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. మంచి పాత్రలు, అవకాశాలు లభించకపోవడంతోనే సినీ పరిశ్రమకు దూరమైన ఫీలింగ్ కలుగుతున్నదని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..

సక్సెస్ చేజారితే ఆ భయం
సినిమా అవకాశాలు లేకపోవడంతో జీవన్మరణ సమస్యగా మారింది. సక్సెస్‌తోనే జీవితం ముడిపడి ఉండటంతో కెరీర్ ఏమౌతుందో అనే భయం వెంటాడుతుంటుంది. సక్సెస్ చేజారితే కింద పడిపోతామనే ఆందోళన ఉంటుంది అని అన్నారు.

అవకాశం కోసం ఎదురుచూపులు
నా కెరీర్‌ను పరిశీలిస్తే నాకు నేను ఫ్రీలాన్సర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓ సినిమా అయిపోతే మరో సినిమా కోసం వెతుకులాట ఉంటుంది. అవకాశాల కోసం పోరాటం చేయాల్సి వస్తున్నది. అలాంటి పరిస్థితులతో మరుక్షణం ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది.

వ్యాపారంలో స్థిరపడాలని
వ్యాపారంలో స్థిరపడాలనే ఆలోచన ఉంది. కానీ నటన అంటే ఇష్టం. ఇంకా మంచి అవకాశాలు వస్తాయనే ఆశ కలుగుతుంటుంది. నా స్వభావానికి తగిన ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నాను అని రాధిక ఆప్టే చెప్పారు.

సైఫ్ అలీఖాన్, టబుతో
ప్రస్తుతం రాధిక ఆప్టే అంధాదున్, బజార్ అనే హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న అంధాదున్‌లో ఆయుష్మాన్ ఖురానా, టబు నటిస్తున్నారు. అక్టోబర్ 26న రిలీజ్ కానున్న బజార్ చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్ సరసన నటిస్తున్నది.

హాలీవుడ్ చిత్రంలో అవకాశం
బాలీవుడ్ సినిమాలే కాకుండా హాలీవుడ్ చిత్రాల్లోనూ రాధిక ఆప్టే నటిస్తున్నారు. దేవ్ పటేల్ నటించిన ది వెడ్డింగ్ గెస్ట్ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంగా తెరకెక్కుతున్నది.


Click it and Unblock the Notifications











