మాజీ సీఎం భార్యకు టోకరా.. 3 కోట్ల చీటింగ్‌.. పోలీసులకు ఫిర్యాదు

కన్నడ నటి, మాజీ సీఎం కుమారస్వామి సతీమణి రాధిక కుమారస్వామికే ఓ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ ఝలక్ ఇచ్చింది. తన అనుమతి లేకుండా తాను నటించిన చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన విషయాన్ని తెలుకొన్న ఆమె భగ్గుమన్నారు. ఆ సదరు యూట్యూబ్ ఛానెల్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకు తన సినిమా వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 2013లో నటి రాధిక కుమారస్వామి

2013లో నటి రాధిక కుమారస్వామి

నటి రాధిక కుమారస్వామి 2013లో స్వీటీ నాన్న జోడి అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం అదే సంవత్సరంలో థియేటర్లో రిలీజైంది. అయితే వాటికి సంబంధించిన డిజిటల్ హక్కుల తనతోనే ఉన్నాయి. దాదాపు 3 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ చిత్రాన్ని యూట్యూబ్ ఛానెల్ డైరెక్టుగా అప్‌లోడ్ చేయడం ఇటీవల ఆమె దృష్టికి వచ్చింది.

డైరెక్టుగా యూట్యూబ్‌లో అప్‌లోడ్

డైరెక్టుగా యూట్యూబ్‌లో అప్‌లోడ్

స్వీటీ నాన్న జోడి సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్‌లో రిలీజ్ చేయడంపై రాధిక కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సినిమాపై దాదాపు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాం. అలాంటి చిత్రాన్ని ఓ వ్యక్తి అక్రమంగా, నా అనుమతి లేకుండా అప్‌లోడ్ చేస్తారు. ముమ్మాటికి ఇది చీటింగే అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు

బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు

స్వీటీ నాన్న జోడి సినిమాను అనుమతి లేకుండా అక్రమంగా యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు అని ఉత్తర బెంగళూరులోని సీఈఎన్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. సైబర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి మమల్ని చీటింగ్ చేశారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.

 రాధిక కమ్ బ్యాక్ చిత్రంగా, నిర్మాతగా మారి

రాధిక కమ్ బ్యాక్ చిత్రంగా, నిర్మాతగా మారి

స్వీటీ నాన్న జోడి చిత్రం ఓ రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కింది. ఆదిత్య అనే హీరోతో కలిసి నటించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత రాధికకు కమ్ బ్యాక్ చిత్రంగా మారింది. విజయలక్ష్మి సింగ్ దర్శకత్వం వహించగా, స్వయంగా రాధిక కుమారస్వామి నిర్మాతగా మారింది.

Recommended Video

Shilpa Shetty Ready To Re Entry In Tollywood After 20 Years
 రాధిక కుమారస్వామి కెరీర్ ఇలా

రాధిక కుమారస్వామి కెరీర్ ఇలా

ఇక రాధిక కుమారస్వామి కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అర్జున్ సర్జా నటించిన కాంట్రాక్టు అనే చిత్రంలో నటించారు. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం భైరాదేవి చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. అలాగే లవ్ మాక్‌టెయిల్ దర్శకుడు డార్లింగ్ కృష్ణ రూపొందించే [email protected] సినిమా కోసం ఆమె సంప్రదించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X