మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు.. రజనీకాంత్ పై సీనియర్ నటీ షాకింగ్ కామెంట్స్
Radhika Sarathkumar: మలయాళ సినీ పరిశ్రమలో ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ తన నివేదికను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నివేదిక ద్వారా పలు సంచలన విషయాలు బయటకు రావడంతో పలు ఇండస్టీల్లో ప్రకంపనలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు ఈ రిపోర్టుపై స్పందిస్తున్నారు. తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న పలు చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ మరోసారి స్పందించింది. అలాగే.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. .....
అసలేం జరిగిందంటే.. ?
ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. హేమ కమిటీ నివేదిక గురించి తనకేమీ తెలియదనీ అన్నారు. రజనీకాంత్ వ్యాఖ్యలపై రాధిక శరత్‌కుమార్ స్పందించారు. హేమ కమిటీ నివేదిక తెలిసిన అగ్ర నటీనటులు మౌనం వహించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హేమ కమిటీ రిపోర్ట్ గురించి రజనీకాంత్‌కు ఏమైనా తెలిసి ఉంటే కచ్చితంగా మాట్లాడేవారనీ, ఆయనకు ఆ విషయం తెలియకపోవడం వల్లే మాట్లాడలేదన్నారు. అయితే.. ఆయన మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారనీ, ఈ విషయంపై సీనియర్ నటీనటులు మాట్లాడాలని సూచించారు.

అగ్ర నటీనటుల మాటలు మహిళా నటులకు ఎంతో ఉపశమనానిస్తాయన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, ప్రజలు కూడా ఈ సమస్యపై మాట్లాడాలని సూచించారు సీనియర్ నటి రాధిక. కోలీవుడ్‌లోని చాలామంది సీనియర్ నటులు రాజకీయాల్లో ఉన్నారనీ, సమాజం కోసం వారు చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలానే వారు తమ తోటి నటీమణుల బాధను అర్థం చేసుకోవాలని, వారికి మద్దతు ఇవ్వాలని రాధిక శరత్‌కుమార్ కోరారు.
గతంలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై నటి రాధిక స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేవలం మలయాళ ఇండస్ట్రీలోనే కాదు. చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 46 ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానీ, తాను కూడా ఒకసారి చేదు అనుభవం ఎదుర్కొన్నానన్నారు. క్యారవ్యాన్ లో సీక్రెట్ గా కెమెరాలు పెట్టి.. ప్రైవేట్ వీడియోలు తీసిన ఘటన తనకు ఎదురైందనీ, ఈ ఘటనను ఎదుర్కొన్న నాటి నుంచి ఆనాటి నుండి క్యారవ్యాన్ ఎక్కాలంటే.. భయపడుతున్నానని వెల్లడించారు.

ఈ క్రమంలో తమిళ ఇండస్ట్రీలో హేమ కమిటీ తరహాలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తానని నటుడు విశాల్ డిమాండ్ చేశారు. దీంతో వారు ఎప్పుడైనా తనను సంప్రదించినట్లయితే తన ఇన్‌పుట్ అందిస్తానని రాధిక చెప్పారు. వేధింపులకు గురైన మహిళలు తనకు తెలుసునని, వారికి సంఘీభావం తెలిపానని రాధికా శరత్‌కుమార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











