Radhika Sarathkumar: శరత్ కుమార్‌ను ముందు రెజెక్ట్ చేశా.. కానీ 2 పెళ్లిళ్లు బ్రేక్ అయ్యాక చేసుకోక తప్పలేదు"
రాధిక శరత్ కుమార్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటించగల సత్తా కల్గిన ఈమె ఇప్పటికీ సినిమాల్లో నటిస్తోంది. అయితే ప్రస్తుతం 61 ఏళ్ల వయసు కల్గిన ఈ క్యూట్ బ్యూటీ ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ ఫుల్ జర్నీని చూసింది. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం పలు సమస్యలు ఎదుర్కుంది. ముఖ్యంగా శరత్ కుమార్ కంటే ముందు ఇద్దరిని పెళ్లి చేసుకున్న ఈమె మూడో సారి అతడిని వివాహం చేసుకుంది.
అయితే తనకు ఒక్కసారి కూడా వివాహం జరగకముందే ఈ ముద్దుగుమ్మను పెళ్లి చేసుకుంటానని శరత్ కుమార్ అన్నారట. రాధిక వాళ్ల తల్లి కూడా ఈ విషయం గురించి రాధికను అడిగిందట. కానీ ఆమె మాత్రం నేను అస్సలే అతడిని చేసుకోనంటూ తేల్చి చెప్పేసిందట. కానీ రెండు పెళ్ళిళ్లు బ్రేక్ అయి విడాకులు తీసుకున్నాకా.. మూడోసారి ముందుగా వద్దనుకున్న శరత్ కుమార్ నే పెళ్లి చేసుకుంది. అయితే తొలిసారి ఎందుకు వద్దనుకుందో ఆ తర్వాత ఎందుకు చేసుకుందో చెప్పింది. ఆ పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్.రాధా కూతురు. ఈమె తల్లి గీత శ్రీలంకకు చెందినది. అయితే 1963 ఆగస్టు 21వ తేదీన జన్మించిన రాధిక.. 1980లో చిలిపి వయసు అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అందం, అభినయంతో వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ వచ్చిన ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈమె సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తున్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకుంది. ముఖ్యంగా 1985లో తమిళ నటుడు ప్రతాప్ పోతన్ ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత ఏడాదే ఇతడికి విడాకులు ఇచ్చేసింది.
ఇక రెండోసారి అంటే 1990లో రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. ఇతడతో రాధికకు ఓ పాప కూడా పుట్టింది. ఆమె పేరే రయాన్నే హార్డీ. అయితే ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయారు. అయితే పాపను మాత్రం తనతోనే ఉంచుకున్న రాధిక.. పాపని పెంచి పెద్ద చేసింది. ఇక 2001లో సహ నటుడు శరత్ కుమార్ ను ఈ ముద్దుగుమ్మ మూడోసారి వివాహం చేసుకుంది. ఇలా ఇతడితో 2004లో ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అతడి పేరే రాహుల్.

అయితే మూడోసారి వివాహం చేసుకున్న శరత్ కుమార్ తో తనకు ముందుగానే పెళ్లి జరిపించాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారట. ముఖ్యంగా రాధికకు పెళ్లి చేయాలని అనుకున్న వెంటనే ఓ పంతులు వద్దకు వెళ్లగా.. రాధిక జాతకం చూసి శరత్ కుమార్ తో పెళ్లి జరిపిస్తే బాగుంటుందని చెప్పారట. ఇదే విషయాన్ని తన వద్ద ప్రస్తావిస్తూ.. తల్లి శరత్ కుమార్ ను వివాహం చేసుకోమని చెప్పిందట. కానీ రాధిక మాత్రం సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను తాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పిందట. అలా శరత్ కుమార్ తో పెళ్లికి నో చెప్పిన ఈమెకు ఆ తర్వాత చేసుకున్న రెండు పెళ్లిళ్లు కలిసి రాలేవు.
కానీ తన కర్మ ఫలితం కారణంగా.. శరత్ కుమార్ నే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని.. చెప్పుకొచ్చింది. ఇతడితో పెళ్లి అయి ఇప్పటికి 23 ఏళ్ల అవుతుండగా.. ఒక్క గొడవ కూడా జరగలేదని.. తామిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని రాధిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాధిక సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ ముందుకెళ్తోంది. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











