‘ఆ హీరోయిన్ లాంటి చావు మరెవరికీ రావొద్దు..' దర్శకేంద్రుడు భావోద్వేగం

ఒక స్టార్ హీరోయిన్... తన అందంతో, అభినయంతో ఇండస్ట్రీని ఏలిన ఆ మహానటి... కానీ ఆమె చివరి రోజులు మాత్రం అందరికీ షాక్ ఇచ్చాయి. తాజాగా ఓ స్టార్ దర్శకుడు ఆమె గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 'ఆమె లాంటి చావు మరెవరికీ రావొద్దు' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అసలు ఆయన ఎందుకు అలా అన్నారు? ఇంత ఆ హీరోయిన్‌ ఎవరు? అసలేం ఏమైంది? ఆమెతో ఆయనకున్న అనుబంధం ఏంటి?

దర్శకేంద్రుడు, శ‌తాధిక ద‌ర్శ‌కుడు రాఘవేంద్రరావు.. తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణంతో పాటు కొన్ని భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఒక ప్రముఖ హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా 'ఆమె లాంటి మరణం మరెవరికీ రావొద్దు' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Raghavendra Rao Emotional on Sridevi Death Says No One Should Face Such End

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. దివంగత నటి శ్రీదేవి. ఈ అతిలోక సుందరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీదేవితో తనకు ఉన్న బంధం ఎంతో ప్రత్యేకమని, ఆమెతో కలసి దాదాపు 24 సినిమాలు చేశానని చెప్పారు. తన కెరీర్‌లో ఆమె ఒక కీలక భాగమని, ఆమెతో పని చేయడం ఎప్పుడూ ఆనందాన్నిచ్చేదని తెలిపారు. ఈ సందర్భంగా 'మామ్' సినిమా ఆడియో ఫంక్షన్‌లో గురించి ప్రస్తావించారు.

శ్రీదేవి తన కాళ్లపై పడి నమస్కరించిందని, మళ్లీ కలిసి పని చేయాలని కోరిందని చెప్పారు. అయితే ఆ తర్వాత ఆమె అకస్మాత్తుగా మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. 'అతిలోక సుందరి దేవలోకానికి వెళ్లిపోయింది... ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి అత్యధిక సేవ చేసిన ఆమెకు అలాంటి మరణం ఉండకూడదు" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. శ్రీదేవి మరణం ఎవరికీ రాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు తన స్టైల్‌కు వచ్చిన గుర్తింపుపై స్పందించారు. పాటల చిత్రీకరణలో పూలు, పండ్లు, రంగులతో విజువల్ గ్రాండియర్ సృష్టించడం తన ప్రత్యేకతగా మారిందని చెప్పారు.మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చెప్పిన 'రాఘవేంద్రరావు సినిమా అంటే స్వర్గాన్ని నేలమీదకు దింపినట్టే' అన్న వ్యాఖ్య తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.

తన కెరీర్‌లో జ్యోతి, దేవత, బొబ్బిలి బ్రహ్మన్న, అన్నమయ్య వంటి క్లాసిక్ చిత్రాలతో పాటు అడవి రాముడు వంటి మాస్ హిట్స్ తెరకెక్కించానని గుర్తు చేసుకున్నారు.'అడవి రాముడు' సినిమాను కేవలం 38 రోజుల్లో పూర్తి చేసి, అప్పట్లోనే భారీ వసూళ్లు సాధించడం తనకు గర్వకారణమని చెప్పారు. ఇక లెజెండరీ నటుడు ఎన్టీఆర్ తో పని చేసిన అనుభవం తన జీవితంలో మర్చిపోలేని అధ్యాయమని తెలిపారు.

అలాగే చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు వంటి మహానటులతో కలిసి పనిచేయడం తన అదృష్టమని అన్నారు. మూడు తరాల హీరోలతో పని చేసిన అరుదైన అవకాశం తనకే దక్కిందని గర్వంగా చెప్పారు. సినిమా నిర్మాణంలో నిర్మాతకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేయడం తన అలవాటని, కథ చెప్పడంలో కూడా కేవలం 20-30 నిమిషాల్లోనే నిర్ణయం తీసుకునే విధంగా పనిచేసేవాడినని వివరించారు. ఈ ఇంటర్య్వూలో నటి శ్రీదేవి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X