శ్రీలీల.. నిన్ను కాదు.. మీ అమ్మను హీరోయిన్ చేసే వాడిని.. రాఘవేంద్రరావు

వరుసపెట్టి క్రేజీ చిత్రాలలో ఆఫర్లతో దూసుకెళ్తున్నారు శ్రీలీల. నిండా పాతికేళ్లు కూడా లేకుండా తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకున్నారు. సీనియర్లు, జూనియర్లు ఇద్దరికీ శ్రీలీలే తమ పక్కన హీరోయిన్‌గా కావాలని ఏరి కోరి ఎంచుకుంటున్నారు. సినిమాల్లోనూ బిజీగా ఉంటూనే.. డాక్టర్ కావాలన్న తన కలను కూడా నెరవేర్చుకున్నారు శ్రీలీల. ఇటీవలే ఎంబీబీఎస్ పట్టాను అధికారికంగా అందుకుని కుటుంబ సభ్యులను, అభిమానులను సంతోషంలో ముంచెత్తారు ఈ ముద్దుగుమ్మ.

శ్రీలీలకు మార్గదర్శిగా తల్లి
శ్రీలీల ఈ స్థాయికి రావడం వెనుక ఆమె తల్లి స్వర్ణలత కష్టం ఎంతో ఉంది. భర్త నుంచి విడిపోయినప్పటికీ ఒంటరి మహిళగా కూతురిని పెంచి పెద్ద చేశారు. కుమార్తెకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌తో పాటు నటనలోనూ శిక్షణ ఇప్పించడంతో పాటు అన్నిరకాలుగా అండగా నిలిచారు. స్వతహాగా గైనకాలజిస్ట్ కావడంతో బిజీగా ఉన్నప్పటికీ కూతురి షూటింగ్స్ సమయంలో ఆమె వెంటే ఉంటూ కష్టపడుతున్నారు. తల్లిని చూసే తాను కూడా డాక్టర్ అవ్వాలని అనుకున్నానని శ్రీలీల పలుమార్లు తెలిపారు. ఇక శ్రీలీలకు స్వర్ణలత అక్కలా కనిపిస్తారు. ఆమె అందమే శ్రీలీలకు వచ్చిందని చెబుతారు. తాజాగా శ్రీలీల తల్లిపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Raghavendra Rao Says He Would Have Made Sreeleela s Mother a Top Heroine 20 Years Ago

కమర్షియల్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా
కే. రాఘవేంద్రరావు బీఏ... పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులు అద్దిన దర్శకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. జానపదాలు, పౌరాణికాలు దుమ్మదులుపుతున్న సమయంలో కమర్షియల్ సినిమాలతో టాలీవుడ్‌ గతిని మార్చారు దర్శకేంద్రుడు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన అరుదైన దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. నట భూషణ శోభన్ బాబు నటించిన బాబు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాఘవేంద్రరావు .. ఎన్టీఆర్‌తో తీసిన అడవిరాముడితో స్టార్ డమ్ అందుకున్నారు. ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటు ఈ తరం హీరోలతోనూ పనిచేసిన అరుదైన ఘనత రాఘవేంద్రరావుది.

మూడు తరాల హీరోలతో అనుబంధం
మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. వీరే కాదు.. శ్రీదేవి, ఖుష్బూ, టబు, దీప్తి భట్నాగర్, శిల్పాశెట్టి, తాప్సీ వంటి వారిని తెలుగు సినిమాకు పరిచయం చేసి స్టార్స్‌గా తీర్చిదిద్దారు. హీరోయిన్లను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావు ఎక్స్‌పర్ట్. కలర్‌ఫుల్‌గా పాటలు చిత్రీకరించడంతో పూలు, పాలు, పండ్లతో గ్లామర్ సొబగులు అద్దారు. ఈ జనరేషన్‌లో భక్తిరస చిత్రాలు తీయడంలోనూ దిట్టగా రాఘవేంద్రరావు పేరు తెచ్చుకున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, ఓం నమో వెంకటేశ వంటి సినిమాలు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.

రాఘవేంద్రరావు చేతుల మీదుగా శ్రీలీల లాంచ్
కాగా.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న శ్రీలీలను పరోక్షంగా తెలుగుతెరకు పరిచయం చేసింది రాఘవేంద్రరావే. కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల.. పెళ్లిసందD సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ మూవీలో తన అందచందాలు, డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయ్యారు శ్రీలీల.

మీ అమ్మని టాప్ హీరోయిన్‌ని చేసేవాడిని
కొద్దిరోజుల క్రితం ధమాకా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాఘవేంద్రరావు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు మాట్లాడుతూ.. పెళ్లిసందDలో శ్రీలీల ఒక ఫ్లూట్ వాయించింది. మామూలు ఫ్లూట్ కాదు.. మొత్తం ఆకాశం నుంచి తారలన్నీ నేల మీద పడుతున్నాయి. ఆంధ్రదేశంలోని మగాళ్ల హృదయాల్లో, ఎవరి కలలో చూసినా శ్రీలీలే వస్తోంది. శ్రీలీల అమ్మగారిని 20 ఏళ్ల క్రితం చూసుంటే ఆమెను స్టార్ హీరోయిన్‌ని చేసేవాడిని. కొంచెం వైజయంతి మాలలా ఉంటారు ఆవిడ అని అనడంతో ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న శ్రీలీల తల్లి స్వర్ణలత.. నవ్వుతూ రాఘవేంద్రరావుకు దండం పెట్టేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Read more about: raghavendra rao sreeleela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X