నీతో పడుకొంటున్నాడు కాబట్టే.. నా మాట వినడం లేదు.. రాజ్ తరుణ్ హీరోయిన్, లవర్ ఫైట్
ప్రతి సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎప్పుడూ ఏదొక కాంట్రవర్సీ ఉంటూనే ఉంటుంది. అలా తాజాగా టాలీవుడ్ లో షాకింగ్ కాంట్రవర్సీ అయితే వైరల్ గా మారింది. అదే యువ హీరో రాజ్ తరుణ్ లవ్ అఫైర్. రాజ్ తరుణ్ తనని మోసం చేసి తన సినిమా హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఇపుడు ప్రేమాయణం నడిపిస్తున్నాడు అని మాజీ లవర్ కేసు ఫైల్ చేసి సంచలనం రేపిన విషయం తెలిసిందే.
దీనితో ఈ వెంటనే రాజ్ తరుణ్ కూడా తన వెర్షన్ తో బయటకి వచ్చాడు. ఆమె నన్ను హింసించేది అని డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు తీసుకొనేది అనేది అతడు కూడా సంచలనం రేపాడు. దీనితో వీటి ముగ్గురు నడుమ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మంచి రసవత్తరంగా మారింది. కాగా ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య అలాగే హీరోయిన్ తో మాట్లాడిన కాల్ టేప్ ఒకటి లీక్ అయ్యి వైరల్ గా మారింది.

కాగా ఇందులో ఆ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో లావణ్య మాట్లాడిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే. లావణ్య మాట్లాడుతూ నేనెప్పుడూ డ్రగ్స్ అమ్మలేదు రాజ్ తరుణ్ నే క్రైమ్ చేస్తున్నాడు అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే సదరు హీరోయిన్ ని నాలాంటి పరిస్థితి నీకు వస్తే మీ అమ్మ నాన్న ఫైట్ చెయ్యరా అంటూ ప్రశ్నించింది.
దీనితో హీరోయిన్ అయినా మీరు విడిపోయారు రాజ్ తరుణ్ నిన్ను వద్దు అనుకుంటున్నపుడు ఎందుకు ఇన్ని సార్లు కాల్ చేస్తున్నావని అడగ్గా మేము విడిపోయామని ఎవరు చెప్పారు నీకు, అతన్ని నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు తెలుసు నువ్ మూసుకొని ఉంటే బెటర్ అంటూ లావణ్య డబుల్ స్టాండర్డ్ లో మాట్లాడుతుంది.
అలాగే హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఇదంతా నన్నెందుకు అడుగుతున్నావు అతన్నే అడగొచ్చు కదా అంటే దీనికి ఇంకా కొంచెం పచ్చిగా మాట్లాడుతూ హీరోయిన్ ని నువ్ రాజ్ తరుణ్ తో పడుకుంటున్నావ్ గా నన్ను అన్ బ్లాక్ చెయ్యమని చెప్పు నా దగ్గరకి వెళ్లిపొమ్మని చెప్పు అప్పుడు అతను వచ్చేస్తాడు అని చెప్పగా నా మాట వింటాడు అని నువ్ ఎలా అనుకుంటున్నావు అని హీరోయిన్ అడిగింది.
దీనితో లావణ్య నువ్వే కదా చెప్పావ్ నీ మాట వింటాడు, నీ కాళ్ళు పట్టుకుంటా నువ్ వేరే అబ్బాయిని తగులుకో అతన్ని వదిలేయ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనితో ఇపుడు ఈ ఆడియో కాల్ టేప్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి వీరిద్దరి లవ్ వార్ ఎక్కడ వరకు వెళ్తుందో, ఎవరు గెలుస్తారో రాజ్ తరుణ్ ఎవరి పక్షాన నిలబడతాడో అని నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మరో పక్క రాజ్ తరుణ్ ఇంకా లావణ్య ఇద్దరు కూడా చట్టపరంగా తమని తాము ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునేందుకు పోరాటం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











