అతడిని ఎప్పుడో పెళ్లి చేసేసుకున్నా.. రాజ్ తరుణ్ హీరోయిన్..

టాలీవుడ్ సినిమాల్లో చాలా చిన్న ఏజ్ లోనే తెరంగేట్రం చేసి మంచి సక్సెస్ లని కెరీర్ స్టార్టింగ్ లోనే అందుకోవడం అనేది చాలా మంది హీరో లేదా హీరోయిన్స్ కి అరుదుగానే జరుగుతుంది. ఒకవేళ సక్సెస్ వచ్చినా దాన్ని వారు ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు అనేవి కూడా వారి కెరీర్ పై చాలా ప్రభావం చూపిస్తాయి. అయితే ఈ కోవలో కొందరు ఇతర భాషలకి చెందిన హీరోయిన్స్ కూడా ఉంటారు.

అలా హిందీ మార్కెట్ నుంచి తెలుగులో సక్సెస్ పొందిన వారు చాలా మంది ఉండగా వీరిలో ఓ యంగ్ హీరోయిన్ అయితే టాలీవుడ్ లో ఒక సాలిడ్ స్టార్ట్ ని అందుకుంది అని చెప్పాలి. ఈమె బిగ్ స్క్రీన్స్ కంటే ముందు స్మాల్ స్క్రీన్స్ మీద వచ్చి తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. మరి ఆమె ఎవరో కూడా కాదు అందరికీ బాగా తెలిసిన 'చిన్నారి పెళ్లి కూతురు' గా బుల్లితెరపై మెప్పించిన నటి అవికా గోర్.

raj tarun heroine avika gor comments on her marriage

మరి తెలుగులో ప్రస్తుతం కాంట్రవర్సీల నడుమ బాగా వినిపిస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తో మొట్ట మొదటి చిత్రం "ఉయ్యాలా జంపాల" సినిమాతో సాలిడ్ హిట్ అందుకొని మంచి డెబ్యూ టాలీవుడ్ లో అందుకోగా ఈ తర్వాత వెంటవెంటనే మళ్ళీ రాజ్ తరుణ్ తోనే "సినిమా చూపిస్తా మావా", నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వరుస హిట్స్ కొట్టి మంచి బిజీగా మారింది.

కానీ తర్వాత ఆమె సినిమాలు ప్లాప్స్ గా మారుతుండడంతో మళ్ళీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది అవికా గోర్. అయితే ఈమెకి అక్కడే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. గత నాలుగేళ్ళ నుంచి మిలింద్ చాంద్వాని అనే ఒకతినితో ప్రేమలో ఉంది. అయితే ఈమె అతన్ని వాళ్ళ పేరెంట్స్ కి కూడా పరిచయం చేసింది కానీ అప్పుడు నుంచి వీరి అధికారికంగా ఇంకా పెళ్లి చేసుకున్నట్టుగా ఎక్కడా రాలేదు.

raj tarun heroine avika gor comments on her marriage

కానీ ఆమె మాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది అని చేసిన పలు కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే తాను అతన్ని బయట ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ మాకు నా బ్రెయిన్ లో ఎప్పుడో పెళ్లయిపోయింది అంటూ ట్విస్ట్ ఇచ్చింది. దీనితో తన బాయ్ ఫ్రెండ్ తో అలా ఎప్పుడో పెళ్లయిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. మరి ఎన్నో ఏళ్ల నుంచి సాగుతున్న వీరి ప్రేమాయణం ఇంకెన్నాళ్లు సాగుతుందో చూడాలి.

ఇక రీసెంట్ గానే ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ "బ్లడీ ఇష్క్" నేరుగా ఓటిటిలో విడుదల అయ్యింది. ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇది కాకుండా ప్రస్తుతం హిందీలోనే ఆమె పలు చిత్రాలు చేస్తుంది. మరి మళ్ళీ తెలుగులో ఎలాంటి సినిమా ఆఫర్లు ఈమెకి పెద్దగా లేవు, చివరిగా గతేడాది పాప్ కార్న్, ఉమాపతి అనే అనే చిత్రాలు చేసింది. ఇవి కూడా పెద్ద విజయాలు సాధించలేదు.

More from Filmibeat

Read more about: avika gor raj tarun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X