ఆ బాలీవుడ్ బ్యూటీతో రాజమౌళి ఎలా వేగుతాడో ఏంటో?

ఇండియన్ బిగ్ బడ్జెట్ తెలుగు సినిమా RRR రిలీజ్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎప్పటిలానే రాజమౌళికి తగ్గట్టు కాలం కూడా ఆడియెన్స్ పై పగబట్టినట్లు అర్ధమవుతోంది. రాజమౌళి చేసిన ఆలస్యానికి అనుకున్నట్లుగానే సినిమా జూన్ నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది.

ఇక ఇంతలో కరోనా లాక్ డౌన్ ఆడియెన్స్ ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. ఈ విధంగా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఇక సినిమా విడుదల మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చిన సమయంలో జక్కన్నకు మరొక కొత్త బాధ వచ్చి పడింది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ షూటింగ్ లో అసలు జాయిన్ అవుతుందా లేదా అనే విషయంలో మరికొన్ని రూమర్స్ వస్తున్నాయి.

Rajamouli faces another new problem for alia bhatt

అసలైతే గతంలోనే ఒకసారి అలియా RRR సినిమా నుంచి తప్పుకున్నట్ల టాక్ వచ్చింది. కానీ వెంటనే అలియా ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది. ఇక ఇప్పుడు కరోనా కారణంగా మరొక కొత్త సమస్య వచ్చి పడింది. దర్శకధీరుడు లాక్ డౌన్ అనంతరం వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ ని ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ అలియా భట్ మిగతా సినిమాలకు RRR కంటే ముందే డేట్స్ ఇచ్చింది.

రూల్ ప్రకారం రానున్న రోజుల్లో ఆ సినిమాలను ఫినిష్ చేయాలి. దీంతో ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా రాజమౌళికి ఇచ్చిన డేట్స్ అన్ని వృధా అయ్యాయి. ఇప్పటివరకు దర్శకుడు అలియాపై ఒక్క సీన్ కూడా షూట్ చేయలేదు. దీంతో రానున్న రోజుల్లో అలియా కారణంగా RRR టీమ్ కొత్త ప్లాన్ రెడీ చేసుకోక తప్పదు. ఆమెకి కుదిరినపుడే షూటింగ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ భామతో రాజమౌళి ఎలా వేగుతాడో చూడాలి. రామ్ చరణ్ కి జోడిగా అలియా భట్ సీత పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X