twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవసేనగా ఆ హీరోయిన్ కరెక్ట్.. అనుష్కకు రాజమౌళి ఝలక్.. ఒకే బ్యూటీపై ప్రభాస్, రానా..

    |

    బాహుబలి1, బాహుబలి2 చిత్రాల తర్వాత ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. ఓవర్‌నైట్‌లో సినీ పరిశ్రమకు సంబంధించి ఈ ముగ్గురు నేషనల్ ఐకాన్లుగా మారిపోయారు. సినిమా రిలీజై సుమారు రెండేళ్లు కావొస్తున్నా బాహుబలి సినిమాకు గానీ, ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన హీరో, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఇంకా వార్తలో నిలుస్తున్నారు. ఇటీవల సినీ ప్రముఖుడు కరణ్ జోహర్ హోస్ట్‌గా ఉండే కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి రాజమౌళి, ప్రభాస్, రానా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి చెప్పిన సమాధానాలు మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. జక్కన్న ఏమన్నారంటే..

     అనుష్కశెట్టికి బదులుగా

    అనుష్కశెట్టికి బదులుగా

    బాహుబలి చిత్రాన్ని హిందీలో తీసి ఉంటే ప్రధాన పాత్రలకు ఎవరినీ ఎంపిక చేసుకొనే వారని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. దేవసేన పాత్రకు అనుష్క శెట్టికి బదులుగా దీపిక పదుకోన్‌ను తీసుకొనే వాడిని. ఆ పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నాను అని రాజమౌళి తన అభిప్రాయాన్ని చెప్పారు.

    ప్రభాస్, రానా పాత్రల్లో

    ప్రభాస్, రానా పాత్రల్లో

    ఇక అమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవ పాత్రలకు హిందీలో ఏ నటులను పరిగణనలోకి తీసుకొనే వారని కరణ్ ప్రశ్నించగా.. ఆ రెండు పాత్రలకు ప్రభాస్, రానా తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం. హిందీలో తీసినా, మరే భాషలో తీసినా వారిద్దరూ తప్ప మరొకరిని ఆ పాత్రల్లో ఊహించుకోలేం అని రాజమౌళి తన సమాధానాన్ని ఇచ్చారు.

    మాకు దీపికా పదుకోన్ అంటే

    మాకు దీపికా పదుకోన్ అంటే

    బాలీవుడ్‌లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్, రానా ఒకే సమాధానం ఇచ్చారు. హిందీలో మాకు బాగా నచ్చిన అందాల తార దీపికా పదుకోన్ అని చెప్పడం గమనార్హం. దీపికా పదుకోన్ అందం, అభినయం అంటే ఇష్టమని వారు పేర్కొన్నారు.

    అనుష్కతో ఆ బంధమే..

    అనుష్కతో ఆ బంధమే..

    కాఫీ విత్ కరణ్ షోలో అనుష్కతో డేటింగ్ గురించి కరణ్ జోహర్ అడుగగా.. అనుష్క నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే. ఎన్ని రూమర్లు వచ్చినా మా మధ్య గత ఎనిమిదేళ్లుగా స్నేహ బంధం కొనసాగుతూనే ఉంది. రూమర్లను మేం పట్టించుకోలేదు అని ప్రభాస్ చెప్పడం గమనార్హం.

    English summary
    In Koffee with Karan, Karan Johar asked Rajamouli that if he were to cast Hindi film actors in 'Baahubali' who would he have taken in which role. While the director said that Bollywood queen Deepika Padukone would have been best suited for Devasena's role (originally plated by Anushka Shetty) he simply refused to replace Prabhas (who played the titular role) and Rana (he played the villainous Bhallala Deva) with anyone else.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X