లిప్‌లాక్ సీన్ల వల్ల.. 100 కోట్ల సినిమా వదులుకున్న స్టార్ హీరో కూతురు.. ఆ మూవీ ఏదో తెలుసా?
టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో రాజశేఖర్ కూతురు శివాని ప్రస్తుతం హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 'పెళ్లి సందD' చిత్రం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకు వస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటోంది. పైగా ఈ యంగ్ బ్యూటీ ఎలాంటి బోల్డ్ కంటెంట్ కు ఆస్కారం లేకుండా కుటుంబంతో కలిసి చూసేలా ఉండే సినిమాలకు మాత్రమే ఎస్ చెబుతూ వస్తోంది. ఇప్పటి వరకు అలాంటి పాత్రలు, సినిమాల్లోనే నటించి తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.
రాజశేఖర్ - జీవితకు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. చిన్న కూతురు శివాత్మిక 'దొరసాని' చిత్రంతో 2019లోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత రెండేళ్లకు 2021లో చిన్న కూతురు శివాని రాజశేఖర్ 2021లో 'అద్భతం' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అంతకు ముందే... ఈ ముద్దుగుమ్మ శ్రీలీలా రోషన్ జంటగా నటించిన ''పెళ్లి సందD' చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంటూ వస్తోంది. అటు చెల్లి శివాత్మిక కూడా అవకాశాలు అందుకుంటోంది.

అయితే రాజశేఖర్ చిన్న కూతురు శివానికి కెరీర్ లో గోల్డ్ అవకాశం మిస్ అయ్యింది. కాదు ఆమె మిస్ చేసుకుంది. దానికి కారణం కూడా ఉందంట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ RC16ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుచ్చిబాబు కెరీర్ మాత్రం 'ఉప్పెన'తోనే ప్రారంభమైంది. తొలి చిత్రంతోనే బుచ్చిబాబు రూ.100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టిని ఇండస్ట్రీకి పరిచయం చేసి బేబమ్మగా మార్చేశాడు. మరోవైపు మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.
కాగా.. 'ఉప్పెన' చిత్రంతో బేబమ్మగా క్రెడిట్ పొందాల్సిన హీరోయిన్ కృతిశెట్టి కాదంట.. ఫస్ట్ హీరోయిన్ గా శివాని రాజశేఖర్ నే ఎంపిక చేశారంట. కానీ, ఈ చిత్రంలో చాలా ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్ కూడా ఉండటంతో శివాని నో చెప్పిందంట. అదే శివాని వదులుకున్న చాన్స్ ను కృతి శెట్టి గ్రాబ్ చేసుకుంది. ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో రూ.100 కోట్ల హీరోయిన్ గా మారిపోయింది. శివాని మాత్రం గోల్డెన్ అవకాశాన్ని వదులుకొని కెరీర్ లో తిప్పలు పడుతుందని అభిప్రాయలు వెల్లడవుతున్నాయి. ఏదేమైనా హీరోయిన్లు తమ లిమిట్స్ లో ఉండి కెరీర్ ను ముందుకు తీసుకెళ్లడం కూడా మంచిదే అంటున్నారు.

శివానీ రాజేశేఖర్ చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ లేవు. రీసెంట్ గా మాత్రం ప్రకటించలేదు. గతేడాది మాత్రం 'విద్య వాసుల అహం' చిత్రంలో అలరించింది. అంతకు ముందు 'కోట బొమ్మాళి పీఎస్' సినిమాతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక చెల్లి శివాత్మిక 'దొరసారి', 'పంచతంత్రం', 'రంగమార్తాండ' వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఈమెకు కూడా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నట్టు కనపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తూనే ఉన్నారు. పలు ఈవెంట్లలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











