నీలాంబరి పాత్రకు ఫస్ట్ ఛాయిస్ రమ్యకృష్ణ కాదా? ఆ రోల్‌ను మిస్ చేసుకొన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం పడయప్ప. 1999 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఆల్ టైమ్ ఫేవరేట్‌గా మిగిలిపోయింది. ఈ చిత్రంలో సౌందర్య, అబ్బాస్, సితార, నాజర్, రాధా రవి తదితరులు నటించారు. లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ కీలక పాత్రలో నటించారు.
ఈ చిత్రానికి మ్యాజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా, ఎస్ మూర్తి, ప్రసాద్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వర్తించారు. కే తనిగాచలం ఎడిటింగ్ బాధ్యతలను పర్యవేక్షించారు. అరుణాచల సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను కే సత్యనారాయణ, ఎంవీ కృష్ణారావు, కే విట్టల్ ప్రసాద్ రావు, పీఎల్ తేనప్పన్ నిర్మించారు. 1999 సంవత్సరంలో ఈ చిత్రం రిలీజై తమిళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించింది.

అయితే పడయప్ప (నరసింహ)ను చూసి ప్రేమలో పడ్డ గొప్పింటి అమ్మాయి నీలాంబరి (రమ్యకృష్ణ)ని కాదని పేదింటి అమ్మాయి వసుంధర (సౌందర్య)ను పెళ్లి చేసుకొంటాడు. దాంతో ద్వేషం పెంచుకొన్న నీలాంబరి.. పడయప్పపై పగ తీర్చుకోవాలనుకొంటుంది. నీలాంబరి చేసిన అనేక కుట్రలు, కుత్రంతాలను పడయప్పా ఎలా తిప్పి కొట్టాడనేది ఈ సినిమా కథ. నీలాంబరి పాత్ర ఇప్పటికే ఆల్ టైమ్ ఫేవరేట్‌గా మారిపోయింది. రమ్యకృష్ణ ఇమేజ్‌ను ఊహించని విధంగా మార్చేసింది. అలాంటి గొప్ప సినిమాకు సీక్వెల్ సిద్దం కాబోతున్నదని సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా క్రేజీగా అప్‌డేట్ ఇచ్చారు.
దక్షిణాదిలో సంచలన విజయం సాధించిన పడయప్పా చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. రజనీకాంత్ జన్మదినం డిసెంబర్ 12వ తేదీని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి, అప్పట్లో జరిగిన విశేషాల గురించి రజనీకాంత్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నీలాంబరి పాత్ర కోసం తాము ముందుగా రమ్యకృష్ణను అనుకోలేదని అసలు విషయాన్ని రజనీకాంత్ బయటపెట్టారు.
పడయప్పా చిత్రంలోని పవర్‌ఫుల్ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ బచ్చన్ అయితే బాగుంటుందని తాను అనుకొన్నాను. నా ఫస్ట్ ఛాయిస్ ఆమెనే. ఆమెను ఈ పాత్ర చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ కుదర్లేదు. ఆమె ఒప్పుకొంటే 2 లేదా 3 సంవత్సరాలు వెయిట్ చేయాలని కూడా అనుకొన్నాం. కానీ ఆ పాత్రపై ఆమె ఆసక్తి చూపలేదు. దాంతో ఆమె స్థానంలో శ్రీదేవీ, మాధురీ దీక్షిత్‌ను అనుకొన్నాం. కానీ ఆ సినిమాలోని నీలాంబరి పాత్ర అవకాశం రమ్యకృష్ణకు దక్కింది అని రజనీకాంత్ తెలిపారు.
నీలాంబరి పాత్ర విషయానికి వస్తే.. రజనీకాంత్‌తో పోటీపడి రమ్యకృష్ణ నటించింది. ఆ సినిమా విజయంలో తన వంతు పాత్రను పోషించింది. ఇప్పటికే రమ్యకృష్ణ చేసిన పాత్రల్లో ఆల్ టైమ్ ఫేవరేట్‌గా నిలిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి చిత్రంలోని రాజమాత శివగామి పాత్ర కూడా ఆ రేంజ్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. రమ్యకృష్ణ కేవలం గ్లామర్ పాత్రలనే కాకుండా పవర్‌ఫుల్ పాత్రలను పోషించి మెప్పించగలదని రుజువు చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











