తిరగబడిన కూలీ లేడీ విలన్ జాతకం.. 350 మంది స్టార్స్‌ని దాటేసి టాప్ ప్లేస్‌లో!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి దిగ్గజాలు ఈ చిత్రంలో నటించారు. దాంతో కూలీపై చిత్ర సీమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ ఈసారి అంచనాలను అందుకోలేకపోయారని స్వయంగా తలైవా అభిమానులే పెదవి విరిచారు. రోబో2.0, జైలర్ చిత్రాల రికార్డులను బద్ధలు కొడుతుందని.. అవలీలగా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని కోలీవుడ్ జనాలు నమ్మకం పెట్టుకోగా.. కనీం 500 కోట్ల క్లబ్‌లోనైనా చేరుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కళ్యాణిగా రెచ్చిపోయిన రచితా రామ్
రజనీ, నాగార్జున, సత్యరాజ్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్ వంటి స్టార్స్ ఉన్నప్పటికీ లోకేష్ వారిని సరిగా వాడుకోలేదనే క్రిటిక్స్ విమర్శించారు. అయితే ఈ మొత్తం టాప్ స్టార్స్‌ని డామినేట్ చేసి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రచితా రామ్. ఈ సినిమా చూస్తున్నంత సేపు.. ఆమెను థియేటర్‌లోనే నరికేయాలని, చంపేయాలని కోపంతో ఊగిపోయారంటే రచిత ఎంతగా తన పాత్రలో జీవించారో అర్ధం చేసుకోవచ్చు. కూలీ రిలీజైన తర్వాత షౌబిర్, రచితల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. రచితా రామ్ పోషించిన కళ్యాణి పాత్రలో ఉన్నన్ని వెరియేషన్స్.. ఆమె నటించిన తీరు శెభాష్ అనిపించుకునేలా ఉంది. సినిమా చివరిలో నాగార్జున ఆమెను చంపేస్తుంటే జనం చప్పట్లు, ఈలలు వేశారంటేనే ఆమె ప్రతిభను మెచ్చుకోవాల్సిందే.

2013లో ఇండస్ట్రీలోకి
ఇప్పుడంటే ఇలా ఉంది కానీ.. రచితా రామ్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది. కర్ణాటకకు చెందిన ఈమె అసలు పేరు బింధ్యా రామ్.. ఆమె సోదరి నిత్యా రామ్ కూడా నటే కావడం విశేషం. భరతనాట్యంలో శిక్షణ పొందిన రచితా రామ్ పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది. 2013లో బుల్‌బుల్ అనే సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. నాటి నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి ద్వారా తెలుగువారిని పలకరించారు రచితా రామ్.
మోస్ట్ వాంటెడ్ నటిగా రచితా రామ్
ప్రస్తుతం రచితా రామ్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కూలీ దెబ్బతో ఆమెకు దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల నుంచి అవకాశాలు క్యూకట్టే ఛాన్స్ ఉంది. ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి దర్శకులు ఆమెను సంప్రదించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూలీలో నటనకు గాను ఇంటా బయటా ప్రశంసలు దక్కుతుండగా రచితా రామ్ తాజాగా ఓ ఘనతను సాధించింది. టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌లో రచితా రామ్‌కు ఛాన్స్ దక్కింది. దేశంలో సినీ సమాచారాన్ని అందించే ఐఎండీబీ పోర్టల్.. గత కొన్నేళ్లుగా మోస్ట్ పాపులర్ భారతీయ నటీనటుల జాబితాను విడుదల చేస్తోంది. తాజాగా ఈ జాబితాలో రచితా దూసుకొచ్చింది.
350 మందిని దాటేసి
ఐఎండీబీ విడుదల చేసిన రేటింగ్‌లో రచితకు ఏకంగా 37వ ర్యాంక్ దక్కింది. గతంలో ఆమె 392వ స్థానంలో ఎక్కడో ఉండేది.. ఇప్పుడు కూలీ దెబ్బకు ఏకంగా 350 మందిని వెనక్కినెట్టసి దూసుకొచ్చేసింది. ఇక ఈ లిస్ట్‌లో కూలీ సినిమాలోనే నటించిన స్టార్ హీరోయిన్ శృతీ హాసన్ 44వ ర్యాంక్‌లో నిలిచింది. ఐఎండీబీ రేటింగ్‌లో 37వ స్థానంలో నిలిచిన విషయాన్ని రచితా రామ్ స్వయంగా ప్రకటించారు. దాంతో అభిమానులు, నెటిజన్లు ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











