గీతాంజలి చూసి నాగార్జునకు ఫ్యాన్ అయిపోయా.. రజీషా విజయన్
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. సర్దార్లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో కార్తి చిత్రంలోని 'నేనే సేనాపతి' పాటకు వేదికపై మాస్ డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది.
రజిషా విజయన్ మాట్లాడుతూ.. గీతాంజలి చూసి నాగార్జున గారి అభిమానిగా మారిపోయా. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సర్దార్ దీపావళి కానుకగా అక్టోబర్ 21న వస్తోంది. ఇందులో ఇందిరా అనే పాత్రలో కనిపిస్తా. చాలా ప్రేమతో ఈ సినిమా చేశా. ప్రేక్షకులకు సర్దార్ పర్ఫెక్ట్ దీపావళి కానుక కాబోతుంది. లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ వున్న స్పై థ్రిల్లర్ సర్దార్. ప్రేక్షకులని తప్పకుండా వినోదం పంచుతుంది. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి'' అని కోరారు.

లైలా మాట్లాడుతూ.. సర్దార్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్, నేను నటించిన శివపుత్రుడు దీపావళి కి విదుదలై ఘన విజయం సాధించింది. సర్దార్ కూడా అదే రోజు వస్తోంది. దీపావళి నా పుట్టిన రోజు కూడా. కార్తి గారు అద్భుతంగా నటించారు. మిత్రన్ గారు చాలా మంచి సినిమాని తీశారు. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.


Click it and Unblock the Notifications











